IPL dream11: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన సెలూన్ నిర్వాహకుడు..!

Published : Sep 29, 2021, 08:00 AM ISTUpdated : Sep 29, 2021, 08:06 AM IST
IPL dream11: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన సెలూన్ నిర్వాహకుడు..!

సారాంశం

క్రికెట్ పై ఆసక్తి తో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ డ్రీమ్ 11 లో అశోక్ తరచూ బెట్టింగ్ పెట్టేవాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ పైనా బెట్టింగ్ పెట్టాడు

ఓ సెలూన్ నిర్వాహాకుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.  ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  బిహార్ లోని మధుబని జిల్లాలో సెలూన్ నిర్వాహకుడు అశోక్ కుమార్ ఠాకుర్ కు డ్రీమ్ 11 రూపంలో అదృష్టం తలుపు తట్టింది. రూ.కోటి  అతనిని వరించాయి.

నానూర్ చౌక్ ప్రాంతంలో అశోక్ కుమార్ కు ఓ సెలూన్ ఉంది. ఆ దుకాణమే అతడికి జీవనాధారం. క్రికెట్ పై ఆసక్తి తో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ డ్రీమ్ 11 లో అశోక్ తరచూ బెట్టింగ్ పెట్టేవాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ పైనా బెట్టింగ్ పెట్టాడు.

అనూహ్యంగా రూ.కోటి దక్కించుకున్నాడు. ఆ సంగతి తెలియగానే అశోక్ ఆనందానికి అవధులు లేవు. గతంలో ఎన్నోసార్లు బెట్టింగ్ పెట్టానని.. ఎప్పుడూ గెలవలేదని ఈ సందర్భంగా అతను చెప్పాడు. రూ.కోటి తో అప్పులు తీర్చి.. ఇల్లు కట్టుకుంటానని చెప్పాడు. అయితే.. రూ.కోటి వచ్చినా తన వృత్తిని మాత్రం వదులుకోనని స్పష్టం చేశాడు. రెండు, మూడు రోజుల్లో నగదు అశోక్ బ్యాంకు ఖాతాలో జమయ్యే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు