ఒకే యువకుడితో.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు పరార్..!

Published : Sep 29, 2021, 09:30 AM IST
ఒకే యువకుడితో.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు పరార్..!

సారాంశం

కూతుళ్లు ముగ్గురూ రాత్రికి రాత్రే కనిపించకుండా పోవడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. బంధువుల ఇళ్లల్లో విచారించారు. 

వారిద్దరూ ముగ్గురు అక్కా చెల్లెళ్లు. వారిలో పెద్ద అమ్మాయికి పెళ్లైంది. అయితే.. భర్తతో గొడవ పడి విడాకులు తీసుకుంది. తర్వాత పుట్టింటికి చేరింది.  కొన్ని రోజుల తర్వాత ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్లు అదృశ్యమయ్యారు. కూతుళ్లు ముగ్గురూ రాత్రికి రాత్రే కనిపించకుండా పోవడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. బంధువుల ఇళ్లల్లో విచారించారు. ఊళ్లోనూ గాలించారు. ఎలాంటి అనుమానాస్పద సంఘటనలు చుట్టుపక్కల జరగలేదు. దీంతో ఏం చేయాలో ఆ తల్లిదండ్రులకు పాలుపోలేదు. ముగ్గురు అమ్మాయిల అదృశ్యం గురించే ఆ ఊళ్లో హాట్ టాపిక్ అయింది. 

ఆ నోటా ఈ నోటా పడి అసలు విషయం ఆ తల్లిదండ్రుల చెవిన పడింది. చివరకు ఆసలేం జరిగిందన్నది ఊరంతా పాకిపోయింది. ఓ యువకుడితో ముగ్గురమ్మాయిల ప్రేమ వ్యవహారం గురించి సోషల్ మీడియాలో వైరల్ అయి కూర్చుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ జిల్లాలోని అజీమ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి పక్క ఊరికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. కొన్నాళ్ల పాటు వారి మధ్య ప్రేమ వ్యవహారం సాగింది. అయితే అనుకోని పరిస్థితుల్లో ఆ యువతి మరో వ్యక్తిని పెళ్లాడాల్సి వచ్చింది. ఆ యువతికి 18 ఏళ్ల వయసున్న చెల్లి ఉంది. వారిద్దరి ప్రేమ వ్యవహారం గురించి చెల్లికి తెలుసు కూడా. అక్కకు పెళ్లయిన తర్వాత ఆ చెల్లి.. తన అక్క ప్రియుడితోనే ప్రేమించింది. అతడు కూడా ఆమెతో ప్రేమాయణం సాగించాడు. పెళ్లయిన తర్వాత కూడా ఆ యువతి తన ప్రియుడిని మర్చిపోలేకపోయింది. దీంతో కొద్ది నెలలకే భర్తతో గొడవలు పడి విడాకులు ఇచ్చి పుట్టింటికి వచ్చేసింది. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం