ఆరుగురు పిల్లల తల్లి.. అక్రమ సంబంధం కోసం..!

Published : Jun 02, 2023, 10:34 AM IST
ఆరుగురు పిల్లల తల్లి.. అక్రమ సంబంధం కోసం..!

సారాంశం

ఇటీవల వారి జీవితాల్లోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. అతనితో పరిచయం కాస్త నూర్జహాన్ కి వివాహేతర సంబంధం గా మారింది. భర్త ఉన్న సమయంలో అతనితో సంబంధం కొనసాగించడం ఆమెకు కష్టంగా మారింది.

ఆమెకు వివాహం జరిగింది. మంచి భర్త, ఆరుగురు సంతానం కూడా ఉన్నారు. భర్త కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, అనుకోకుండా వారి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఫలితంగా అతని కోసం, అతనితో అక్రమ సంబంధం కోసం సదరు మహిళ ఏకంగా కట్టుకున్న భర్తను కిరాతకంగా హత్య చేసింది. ఈ సంఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బిహార్ రాష్ట్రం గోపాల్ గంజ్ జిల్లా లాధ్ పూర్ గ్రామానికి చెందిన మహ్మద్ మియాన్ అనే వ్యక్తికి నూర్జహాన్ ఖాతూన్ అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఆరుగురు సంతానం కూడా ఉన్నారు. మహ్మద్ చేపల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా.. ఇటీవల వారి జీవితాల్లోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. అతనితో పరిచయం కాస్త నూర్జహాన్ కి వివాహేతర సంబంధం గా మారింది. భర్త ఉన్న సమయంలో అతనితో సంబంధం కొనసాగించడం ఆమెకు కష్టంగా మారింది.

వీరి ఎఫైర్ గురించి భర్తకు తెలియడంతో, అతను ఇలాంటి పనులు చేయవద్దని భార్యను మందలించాడు. ఈ విషయంలో వారిద్దరూ తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మారమని భార్యకు నచ్చచెబుతూ ఉండేవాడు. ఎంత చెప్పినా వినకపోయే సరికి, భార్యను తరచూ కొట్టడం మొదలుపెట్టాడు.

రోజు రోజుకూ చిత్రహింసలు పెరిగిపోవడంతో నూర్జహాన్ చివరకు.. పిల్లలను తీసుకుని ప్రియుడితో వెళ్లేందుకు నిర్ణయించుకుంది. ఈ విషయం తెలిసి ఇటీవల భార్యను మరింత చిత్రహింసలకు గురి చేసేవాడు. దీంతో చివరకు ఆమె భర్తను చంపేయాలనుకుంది. ఇదే విషయాన్ని ప్రియుడికి చెప్పింది. ఇద్దరూ కలిసి కిరాయి గుండాలను మాట్లాడారు. వారికి రూ.50వేలు సుపారీ ఇచ్చారు. మహ్మద్ రాత్రిపూట నిద్రపోతున్న సమయంలో అతనిపై కిరాయి గుండా కాల్పులు జరిపాడు. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు.  సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?