కొంపముంచిన డేటింగ్ యాప్ పరిచయం.. ఐస్ తెమ్మని చెప్పి, మద్యంలో మత్తుమందు కలిపి నిలువుదోపిడీ చేసిన మహిళ..

By SumaBala Bukka  |  First Published Oct 12, 2023, 12:09 PM IST

బంబుల్ డేటింగ్ యాప్‌లో పరిచయమైన ఒక మహిళ గురుగ్రామ్ వ్యక్తిని మత్తుమందు ఇచ్చి దోచుకుంది, అతడి దగ్గరినుంచి ఐఫోన్, బంగారు ఆభరణాలు, బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులతో డబ్బులు దోచుకుంది. 


హర్యానా : హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ ఛీటింగ్ ఘటన వెలుగు చూసింది. డేటింగ్ యాప్ లో పరిచయం అయిన ఓ యువతి యువకుడిని నిలువునా దోచింది. అతని ఇంట్లోనే అతడికి మత్తుమందు ఇచ్చి మొబైల్ ఫోన్, బంగారు ఆభరణాలు, అతని బ్యాంకు అకౌంట్ నుంచి రూ. 1.78 లక్షలు పోగొట్టుకున్నాడని బుధవారం పోలీసులు తెలిపారు.

బంబుల్ డేటింగ్ యాప్ ద్వారా సాక్షి అలియాస్ పాయల్ అనే ఆ మహిళతో పరిచయం ఏర్పడిందని బాధితుడు రోహిత్ గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను ఢిల్లీకి చెందినవాడినని, ప్రస్తుతం గురుగ్రామ్‌లో తన అత్తతో నివసిస్తున్నానని ఆ మహిళ తనతో చెప్పిందని ఆయన చెప్పారు.

Latest Videos

మొబైల్‌ ఫోన్‌ కోసం గొడవ.. స్నేహితుడిని ఇటుకతో కొట్టిచంపిన మైనర్...

"అక్టోబర్ 1న, ఆమె నాకు ఫోన్ చేసి, కలుద్దామని అడిగింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో, సెక్టార్ 47లోని డాక్‌యార్డ్ బార్ దగ్గర నుండి ఆమెను పికప్ చేసుకోమని నన్ను పిలిచింది. నేను ఆమెను పికప్ చేసుకున్నాను. ఆ తరువాత దగ్గర్లోని దుకాణంలో మద్యం కొనుక్కుని మా ఇంటికి వచ్చాం" అని గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అతని ఇంటికి వచ్చిన తరువాత, ఆ మహిళ అతడిని ఐస్ తీసుకురమ్మని కోరింది. దీంతో అతను వంటగదికి వెళ్లాడు. అతను అక్కడినుంచి వెళ్లగానే... అతని డ్రింక్‌లో ఏదో మత్తుమందు కలిపింది. తిరిగి వచ్చిన అతను ఆ మందు తాగేసరికి వెంటనే స్పృహ కోల్పోయాడు. 

"మత్తు ప్రభావం చాలా తీవ్రంగా ఉంది, అక్టోబర్ 1 రాత్రి స్పృహ కోల్పోతే.. అక్టోబర్ 3 ఉదయం నిద్రలేచాను. అప్పటికి మహిళ ఇంట్లో లేదు. నా బంగారు గొలుసు, ఐఫోన్ 14 ప్రో, రూ. 10,000 నగదు, క్రెడిట్ డెబిట్ కార్డులు మిస్ అయ్యాయి.

"నా క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా రూ. 1.78 లక్షలు విత్‌డ్రా అయినట్లు గుర్తించాను" అని గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మహిళపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

click me!