ఐదు వేల ఏళ్లుగా భారత్ లౌకిక దేశమే అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దేశంలో చాలా వైవిధ్యం ఉందని, ఒకరితో ఒకరు గొడవ పెట్టుకోవద్దని సూచించారు. మనుషులంతా ఒక్కేటే అని భావనను ప్రంపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.
భారత్ 5,000 సంవత్సరాలుగా లౌకిక దేశమే అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ప్రజలంతా ఐక్యంగా ఉండాలని, మానవ ప్రవర్తనకు ఉత్తమ ఉదాహరణను ప్రపంచం ముందుంచాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త రంగ హరి రచించిన ‘పృథ్వీ సూక్త - యాన్ ఓడ్ టు మదర్ ఎర్త్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో భగవత్ ప్రసంగించారు. ప్రతీ ఒక్కరికీ మాతృభూమి పట్ల భక్తి, ప్రేమ, అంకితభావం కలిగి ఉండాలని అన్నారు.
తిరుపతికి డబుల్ డెక్కర్ ఈ-బస్సులు.. ఏపీలో తొలి సారిగా ఇక్కడే సేవలు.. ఎప్పటి నుంచి అంటే ?
‘5 వేల ఏళ్ల నాటి మన సంస్కృతి లౌకికమైనది. అన్ని తత్వ జ్ఞానాల్లోనూ ఇదే ముగింపు. ప్రపంచమంతా ఒకే కుటుంబం. ఇదీ మన భావన. ఇది సిద్ధాంతం కాదు... దానిని తెలుసుకోండి. గ్రహించండి. దానికి అనుగుణంగా ప్రవర్తించండి’’ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ తెలిపారు. దేశంలో చాలా వైవిధ్యం ఉందని, ఒకరితో ఒకరు గొడవ పెట్టుకోవద్దని సూచించారు. మనుషులంతా ఒక్కేటే అని ప్రపంచానికి బోధించే సామర్థ్యాన్ని, దేశాన్ని తయారు చేయాలని ఆయన కోరారు.
ICC World cup 2023: పాకిస్థాన్ తో మ్యాచ్ కు ముందు.. టీమ్ ఇండియాకు రోహిత్ శర్మ సూచనలు..
ప్రపంచ శ్రేయస్సు కోసమే మఠాధిపతులు భారత్ ను రూపొందించారని భగవత్ అన్నారు. తమ జ్ఞానాన్ని దేశంలోని చిట్టచివరి వ్యక్తికి అందించే సమాజాన్ని వారు సృష్టించారని తెలిపారు. వారు కేవలం సన్యాసులు మాత్రమే కాదని, కుటుంబ సమేతంగా జీవనం సాగించారని తెలిపారు. బ్రిటిష్ వారు క్రిమినల్ తెగలుగా ప్రకటించిన ఈ 'ఘుమాంటూస్' (సంచార జాతులు) ఇప్పటికీ ఉన్నారని, వారు తరచూ సమాజంలో తమ సంస్కృతిని ప్రదర్శిస్తూ కనిపిస్తారని తెలిపారు. కొందరు ఆయుర్వేద జ్ఞానాన్ని పంచుకుంటారని ఆయన అన్నారు.
మెక్సికో నుంచి సైబీరియా వరకు మన ప్రజలు విజ్ఞానాన్ని తీసుకుని ప్రపంచవ్యాప్తంగా పర్యటించారని మోహన్ భగవత్ అన్నారు. అందువల్ల, ప్రధానంగా ఆర్థిక సమస్యలపై చర్చించడానికి వేదిక అయిన జీ- 20 ను భారతదేశం మానవత్వం గురించి ఆలోచించే వేదికగా మార్చడంలో ఆశ్చర్యం లేదని అన్నారు. దీనికి 'వసుధైవ కుటుంబకం' అనే భావనను ఇవ్వడం ద్వారా, మనం దానిని మానవుల గురించి ఆలోచించే వేదికగా మార్చామని తెలిపారు.