భర్త హత్యకేసులో ఐదేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న భార్య, సినిమాటిక్ గా ప్రత్యక్షమవ్వడంతో షాక్.. అసలేం జరిగిందంటే..

By AN TeluguFirst Published Oct 21, 2021, 9:25 AM IST
Highlights

biharలోని కట్ హారీ  గ్రామానికి చెందిన వికాస్ కుమార్ 2015లో  తన సోదరుడు రామ్ బహదూర్ కనిపించడం లేదంటూ  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు రామ్ బహదూర్ ని అతని భార్య, అత్తింటివారే kidnap చేసి murder చేసి ఉంటారని ఆరోపణలు చేశాడు.

చనిపోయిన మనిషి తిరిగి రావడం ఎక్కడైనా చూశారా?  సినిమాలలో తప్ప నిజ జీవితంలో అలా జరగడం దాదాపు అసాధ్యం.  కానీ అచ్చం  సినిమా తరహాలోనే  బీహార్లో ఇలాంటి సంఘటన జరిగింది.  బీహార్లోని నర్కటియాగంజ్ ప్రాంతంలో ఓ వ్యక్తి హత్య కేసులో అతని భార్య ఐదేళ్లుగా శిక్ష అనుభవిస్తోంది.

అనుకోకుండా ఒక రోజు నేను బతికే ఉన్నాను.. అంటూ ఆ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు.  ఇది చూసిన అతని కుటుంబ సభ్యులు అంతా షాక్ కు గురయ్యారు.  అసలు విషయం ఏమిటంటే…

biharలోని కట్ హారీ  గ్రామానికి చెందిన వికాస్ కుమార్ 2015లో  తన సోదరుడు రామ్ బహదూర్ కనిపించడం లేదంటూ  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు రామ్ బహదూర్ ని అతని భార్య, అత్తింటివారే kidnap చేసి murder చేసి ఉంటారని ఆరోపణలు చేశాడు.

పోలీసులు అతని వాదనని పట్టించుకోకపోవడంతో 2016లో కోర్టుకు వెళ్ళాడు. ఇంకా కేసు కొనసాగుతూనే ఉంది.  నిందితులు  అండర్ ట్రైల్ లో  జైలు శిక్ష అనుభవిస్తున్నారు.  ఈ కేసులో నిందితులు అందరికీ ఈ మధ్యే హైకోర్టులో bail దొరికింది.  కానీ ఇప్పుడు ఒక్కసారిగా తాను బతికే ఉన్నానని రామ్ బహదూర్  courtకి రావడంతో అందరూ  ఖంగు తిన్నారు.

 అసలు ram bahadhur ఐదేళ్ల వరకు ఎక్కడున్నాడు?  ఈ ఐదేళ్లలో  కుటుంబ సభ్యులను  ఎందుకు కలవలేదు?  అనే ప్రశ్నలకు అతను సమాధానం చెప్పాడు. రామ్ బహదూర్  ఐదేళ్ల క్రితం ఉద్యోగం లేకపోవడంతో.. అతను job కోసం గుజరాత్ వెళ్ళాడు. అక్కడ ఒక దారం తయారుచేసే ఫ్యాక్టరీ లో అతనికి ఉద్యోగం దొరికింది.

ఒకరోజు సెలవు తీసుకుని gujarat నుంచి బీహార్లోని తన ఇంటికి రామ్ బహదూర్ బయల్దేరాడు. దారిలో తను వస్తున్న బస్సు యాక్సిడెంట్ అయింది.  యాక్సిడెంట్లో రామ్ బహదూర్ తలకు బలంగా గాయం కావడంతో  అతను comaలోకి వెళ్లిపోయాడు.  కొంతకాలం తర్వాత అతను కోమా నుంచి కోలుకున్నా అతనికి ఏదీ గుర్తుకు రాలేదు. 

విమానంలో నటి నడుం పట్టుకుని ఒళ్ళోకి లాక్కుని అసభ్య ప్రవర్తన.. వ్యాపారవేత్తపై కేసు

అలా నాలుగేళ్ళు గడిచిపోయాయి.  ఆసుపత్రిలో ఒక రోజు రామ్ బహదూర్ కి అనుకోకుండా తన గతం గురించి కొద్ది కొద్దిగా గుర్తుకు వచ్చింది. అప్పటి నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తను తప్పిపోయాను అంటూ ఫిర్యాదు చేశాడు.  పోలీసులకు అతను చెప్పేది అర్థం కాలేదు.  అలా అతను తన family కోసం వెతకడం మొదలు మొదలుపెట్టాడు.

2021 ఫిబ్రవరి లో ఒకరోజు ఆస్పత్రిలో ఒకరి face bookలో తన కొడుకు ఫోటో చూశాడు.  ఫేస్ బుక్ లో కొడుకు ఫోన్ నెంబర్ కూడా ఉండడంతో రామ్ బహదూర్ కాల్ చేశాడు.  అతనికి జరిగిందంతా ఫోన్లో చెప్పాడు.  ఆ తర్వాత రామ్ బహదూర్ భార్య, అతని కొడుకు గుజరాత్ చేరుకున్నారు. 

వారిద్దరితో కలిసి రాం బహదూర్ తన స్వగ్రామానికి చేరుకున్నాడు.  అక్కడ కోర్టులో జరిగిందంతా రామ్ బహదూర్ చెప్పాడు. ప్రస్తుతం పోలీసులు రామ్ బహదూర్ మిస్సింగ్,  హత్య కేసు ని మళ్ళీ మొదటినుంచి దర్యాప్తు చేస్తున్నారు. 

click me!