దారుణం : రివర్స్ తీస్తున్న ట్రక్కు గుద్దుకుని... నుజ్జు నుజ్జైన ఓనర్... !

Published : Feb 15, 2021, 10:41 AM IST
దారుణం : రివర్స్ తీస్తున్న ట్రక్కు గుద్దుకుని... నుజ్జు నుజ్జైన ఓనర్... !

సారాంశం

మరునిముషం ఏం జరగబోతుందో చెప్పలేకపోవడమే జీవితం. అప్పటివరకు బాగా ఉన్న వ్యక్తి అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. సొంత ట్రక్కే అతని ప్రాణాలు తీసింది. పూనేలో జరిగిన ఈ దారుణ ఘటనలో 45యేళ్ల వ్యక్తి క్షణాల్లో మృతి చెందాడు.

వివరాల్లోకి వెడితే ఓ భారీ ట్రక్కును రివర్స్ చేయడంలో డ్రైవర్ కి సాయం చేయాలనుకున్నాడో వ్యక్తి. అయితే అదే తన జీవితాన్ని నాశనం చేస్తుందని, అవే ఆఖర్ క్షణాలని ఊహించలేకపోయాడు. ఈ ఘోరమైన ఘటన మహారాష్ట్రలోని పూణేలో వెలుగు చూసింది. స్థానికంగా నివశించే ఓ 45 ఏళ్ల వ్యక్తికి ఓ ట్రక్కు ఉంది. డ్రైవర్ ఆ ట్రక్కును రివర్సు చేయడానికి ప్రయత్నిస్తుండగా, అతనికి సాయం చేద్దామని ఓనర్ వచ్చాడు. 

ఆ ట్రక్కు వెనక గోడ ఉంది. చాలా జాగ్రత్తగా చేస్తే కానీ రివర్స్ కాదు. అందుకే ఓనర్ ట్రక్ వెనకుండి సూచనలిస్తూ రివర్స్ చేయిస్తున్నాడు. అయితే గోడకు, ట్రక్కుకు మధ్య దూరాన్ని అంచనా వేయడంలో డ్రైవర్ ఫెయిలయ్యాడు. దీంతో, సడెన్‌గా ట్రక్కు వెనక్కి తీసి యజమానిని గుద్దేశాడు. 

అనుకోని ఈ పరిణామానికి యజమాని గమనించే లోపే గోడకు, ట్రక్కుకు మధ్య అతను నలిగిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ట్రక్కు యజమాని, ఆ తర్వాత మరణించాడని అధికారులు తెలిపారు. నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి దారుణ హత్యకు కారణమైనందుకు సదరు ట్రక్కు డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌