అగ్నివీర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని యువకుడి ఆత్మహత్య..

By Sumanth KanukulaFirst Published Aug 27, 2022, 11:54 AM IST
Highlights

అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ పరీక్షలో విఫలమైన ఓ యువకుడు బలవన్మరణం చెందాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని పౌరీ గర్వాల్ జిల్లాలో చోటుచేసకుంది.

అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ పరీక్షలో విఫలమైన ఓ యువకుడు బలవన్మరణం చెందాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని పౌరీ గర్వాల్ జిల్లాలో చోటుచేసకుంది. 23 ఏళ్ల  సుమిత్ కుమార్ నౌగావ్ కమండ గ్రామంలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడు కోట్‌ద్వార్‌లో కొనసాగుతున్న అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ పరీక్ష‌కు హాజరయ్యాడు. అయితే ఆ పరీక్షలో సుమిత్ కుమార్ విఫలమ్యాడు. ఇక, బుధవారం సాయంత్రం ఇంటికి చేరుకున్న సుమిత్ కలత చెందినట్టుగా కనిపించారు. ఇంట్లో వాళ్లతో పెద్దగా మాట్లాడలేదు. అనంతరం అతని గదిలోకి వెళ్లిపోయాడు. అయితే గురువారం ఉదయం 6.45 గంటల ప్రాంతంలో సుమిత్ ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. 

నౌగావ్ కమండకు రెవెన్యూ పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ అయిన వేద్‌ ప్రకాష్ పట్వాల్  ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సుమిత్ కుమార్ గత నాలుగు సంవత్సరాలుగా ఆర్మీలో చేరేందుకు సాధన చేస్తున్నాడు. అతను బుధవారం అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి వెళ్ళాడు. కానీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సుమిత్ నిరాశతో కనిపించాడని, పెద్దగా మాట్లాడలేదని అతని తల్లిదండ్రులు చెప్పారు. అయితే సుమిత్ ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో ఎటువంటి సూసైడ్ నోట్ కనిపించలేదు’’ అని చెప్పారు. 

అయితే సుమిత్ తల్లిదండ్రులు పరీక్షలో విఫలమైనందుకు అతడు కలత చెందాడని పోలీసులకు చెప్పారు. అతనికి అప్పటికే 23 ఏళ్లు ఉన్నందున ఆర్మీలో చేరేందుకు ఇది అతని చివరి ప్రయత్నంగా తెలుస్తోంది. 

click me!