
ముంబైలో దారుణం జరిగింది. తప్పిపోయిన ఓ బాలిక శవమై కనిపించింది. ఓ ట్రావెల్ బ్యాగ్ లో ఆమె మృతదేహం కత్తిపోట్లతో ఉండటం స్థానికంగా కలకరం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అంధేరి ప్రాంతంలో గురువారం 15 ఏళ్ల బాలిక తప్పిపోగా.. శుక్రవారం మధ్యాహ్నం నైగావ్ (తూర్పు)లోని ఆమె మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై వాలివ్ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
గులాంనబీ గుడ్ బై.. అమిత్ షాతో జమ్మూ బీజేపీ యూనిట్ భేటీ.. వేగంగా మారుతున్న కాశ్మీర్ రాజకీయాలు
ఈ ఘటనపై పోలీసులు, బాధితురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. గత గురువారం అంధేరి (తూర్పు)లోని తన ఇంటి నుంచి బాలిక ఉదయం 11.45 గంటలకు రోజు మాదిరిగానే ఆటోరిక్షాలో విలే పార్లే పాఠశాలకు బయలుదేరింది. అయితే ఎప్పటిలా సాయంత్రం 6.15 గంటలకు తిరిగి రాలేదు. దీంతో 22 ఏళ్ల సోదరి ఏం జరిగిందో తెలుసుకోవడానికి పాఠశాలకు వెళ్లింది, కానీ అప్పటికి స్కూల్ మూసివేశారు. బాలిక దగ్గర ఫోన్ లేకపోవడంతో కాల్ చేయడం కూడా కుదరలేదు. దీంతో తల్లిదండ్రులు తన క్లాస్ మేట్స్ పిలిచి విచారించారు. అయితే బాలిక పాఠశాలకు రాలేదని వారు చెప్పారు.
వ్యక్తిగత సహాయకుడి భార్యగా సోనాలి ఫోగట్ పేరు.. ఆ డాక్యూమెంట్స్‌లో సంచలన విషయాలు..!
బాలిక ఎంతకీ తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం పోలీసులను ఆశ్రయించారు. తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 363 (కిడ్నాప్) కింద కేసు నమోదు చేశారు. కాగా.. అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో పెరీరా నగర్ లోని ఓ పెద్ద ట్రావెల్ బ్యాగ్ పడి ఉండటాన్ని గమనించిన ఓ బాటసారి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వారు అక్కడికి చేరుకొని బ్యాగ్ ను ఓపెన్ చేశారు. దీంతో ఓ మృతదేహం బెడ్ షీట్ లో చుట్టి కనిపించింది. పొత్తికత్తిడుపుపై కత్తితో పొడిచిన గాయాలు కనిపించాయి. బాలిక మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం పంపించారు.
49వ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ యూయూ లలిత్
ఈ ఘనపై అంధేరీ పోలీసు సీనియర్ అధికారి కైలాష్ బార్వే మాట్లాడుతూ.. హత్య ఎక్కడో జరిగిందని, అనంతరం మృతదేహాన్ని రైలులో తీసుకువచ్చి ఏకాంత ప్రదేశంలో పడేసి వెళ్లారని చెప్పారు. బాలిక అదృశ్యం కేసుపై దర్యాప్తు చేస్తున్నప్పుడు అంధేరి పోలీసులు 21 ఏళ్ల బాంద్రా నివాసితో కలిసి బాలిక కనిపించకుండా పోయినట్టు గుర్తించారు. అతడినే ప్రధాన నిందితుడిగా గుర్తించామని చెప్పారు. ‘‘ బాంద్రా (తూర్పు)కి చెందిన ఓ యువకుడు తప్పిపోయాడని అతడి తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం నిర్మల్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ’’ అని అంధేరి పోలీసు అధికారి పేర్కొన్నారు. ఈ కేసులు దర్యాప్తు కొనసాగుతోంది. సీసీ టీవీ పుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు.