మేఘాలయకు పాకిన కుకీ, మైతేయ్ వర్గాల మధ్య ఘర్షణలు.. హింసాత్మక ఘటనల నేపథ్యంలో 16 మంది అరెస్టు..

By Asianet NewsFirst Published May 6, 2023, 7:51 AM IST
Highlights

మేఘాలయలో కుకి, మెయిటీ వర్గాల మధ్యన ఘర్షణ మొదలైంది. రాజధాని ప్రాంతంలో ఇరు వర్గాలకు చెందిన విద్యార్థుల మధ్య హింస చెలరేగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 16 మందిని అరెస్టు చేశారు. 

కుకి, మెయిటీ వర్గాల మధ్య మొదలైన ఘర్షణ ఇప్పుడు మేఘాలయకు పాకింది. కొన్ని రోజుల కిందటి నుంచి మణిపూర్ లో ఈ రెండు వర్గాల మధ్య గొడవ మొదలై తీవ్ర హింసకు దారి తీసింది. ఇప్పటికీ ఆ రాష్ఠ్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ అల్లర్లపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ఇండియన్ ఆర్మీ సైనికులు ఆ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోహరించారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కర్ఫ్యూ విధించడంతో పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు.

చెదలను నివారిస్తామని చెప్పి.. బెడ్ రూమ్ లోకి వెళ్లిన దుండగుడు.. తరువాత ఏం జరిగిందంటే ?

ఈ రెండు వర్గాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ పక్కనే ఉన్న మేఘాలయలో కూడా కనిపించింది. మేఘాలయ రాజధానిలోని మిజో మోర్డెన్ స్కూల్ సమీపంలోని నోంగ్రిమ్ హిల్స్ లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కుకీ, మైతేయి వర్గాలకు చెందిన విద్యార్థులు ఘర్షణకు దిగారు. వీరంతా షిల్లాంగ్‌లోని కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో చదువుతున్న విద్యార్థులు. ఈ ఘటనపై సామాచారం అందగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో 16 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనల నేపథ్యంలో పోలీసులు రెండు వర్గాలకు హెచ్చరికలు జారీ చేశారు. అశాంతి సృష్టించి హింసను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

కాగా.. మణిపూర్ లో బుధవారం రాత్రి మొదటిసారిగా ఘర్షణలు చెలరేగి రాత్రికి రాత్రే తీవ్రరూపం దాల్చాయి. మెయిటీ కమ్యూనిటీని షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) కేటగిరీలో చేర్చాలన్న డిమాండ్ ను వ్యతిరేకిస్తూ నాగా, కుకి గిరిజనులు నిర్వహించిన ‘ట్రైబల్ సాలిడారిటీ మార్చ్’ కు వేలాది మంది హాజరయ్యారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు భారత సైన్యం, అస్సాం రైఫిల్స్ ను ఆరు జిల్లాల్లో మోహరించారు.

కేరళ తొలి ట్రాన్స్ జెండర్ బాడీ బిల్డర్ ప్రవీణ్ నాథ్ ఆత్మహత్య.. మనస్థాపంతో భార్య కూడా ఆత్మహత్యాయత్నం..ఎందుకంటే

పెరుగుతున్న హింసను నియంత్రించడానికి మణిపూర్ ప్రభుత్వం అవసరమైతే ‘తీవ్రమైన సందర్భాల్లో’ కాల్పులు జరపాలని ఆదేశాలు జారీ చేయవలసి వచ్చింది. ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో చెదురుమదురు అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సత్వర చర్యలు చేపట్టిన భారత సైన్యానికి, అస్సాం రైఫిల్స్ కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

అయితే మణిపూర్ లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని సైన్యం తెలిపింది. అందరూ సమన్వయంతో పని చేయడం వల్ల ఇది సాధ్యమైందని పేర్కొంది. అస్సాంలోని రెండు వైమానిక స్థావరాల నుంచి సీ17 గ్లోబ్ మాస్టర్, ఏఎన్ 32 విమానాలతో ఐఏఎఫ్ నిరంతరం గాలింపు చేపట్టింది.కేంద్ర హోం మంత్రి అమిత్ షా మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మణిపూర్ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు.

పాక్‌కు రహస్య సమాచారం అందించిన డీఆర్‌డీవో శాస్త్రవేత్త.. అరెస్టు చేసిన మహారాష్ట్ర ఏటీఎస్

హింసాత్మక ఘటనలతో అతలాకుతలమైన మణిపూర్ కు మరో 10 కంపెనీల సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్ )ను కేంద్ర హోంశాఖ శుక్రవారం పంపింది. కాగా.. రాష్ట్ర మొత్తం జనాభాలో నాగాలు, కుకీలు 40 శాతం ఉన్నారు
 

click me!