బారాముల్లాలో ఎన్ కౌంటర్, లష్కరే ఉగ్రవాది హతం.. కొనసాగుతున్న ఆపరేషన్

Published : May 06, 2023, 08:26 AM IST
బారాముల్లాలో ఎన్ కౌంటర్, లష్కరే ఉగ్రవాది హతం.. కొనసాగుతున్న ఆపరేషన్

సారాంశం

జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లాలో శనివారం ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది. 

ఉత్తర కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో శనివారం ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో లష్కరే  ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. బారాముల్లాలోని కర్హమా కుంజర్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ ప్రారంభమైందని, భద్రతా దళాలు ఉగ్రవాదులకు ధీటుగా జవాబిస్తున్నాయని పోలీసులు తెలిపారు.

మేఘాలయకు పాకిన కుకీ, మైతేయ్ వర్గాల మధ్య ఘర్షణలు.. హింసాత్మక ఘటనల నేపథ్యంలో 16 మంది అరెస్టు..

ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అయితే ఉగ్రవాదులను లొంగిపోవాలని బలగాలు కోరడంతో వారు కాల్పులు జరిపారు. ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. 

అయితే అంతకు ముందు కాశ్మీర్ జోన్ పోలీసులు చేసిన ఓ ట్వీట్ లో ‘‘బారాముల్లాలోని కర్హమా కుంజర్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. పోలీసులు, భద్రతా దళాలు పనిలో ఉన్నాయి. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని పేర్కొన్నారు. 

 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్