ఐపీఎల్ కాదు.. లాక్ డౌన్ పైనా బెట్టింగులు..!

Published : Apr 16, 2021, 03:24 PM IST
ఐపీఎల్ కాదు.. లాక్ డౌన్ పైనా బెట్టింగులు..!

సారాంశం

ఐపీఎల్ సీజన్ లో ఎవరు గెలుస్తారంటూ బెట్టింగ్ వేసినట్లు... లాక్ డౌన్ విధిస్తారా లేదా అంటూ రూ.వేల రూపాయలు దీనిపై బెట్టింగ్ పెడుతుండటం గమనార్హం. 

దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తోంది. సెకండ్ వేవ్ చాలా భయంకరంగా ఉంది. ప్రతిరోజూ దాదాపు రెండు లక్షల కరోనా కేసులు నమోదౌతున్నాయి. ఈ క్రమంలో దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.

ఐపీఎల్ సీజన్ లో ఎవరు గెలుస్తారంటూ బెట్టింగ్ వేసినట్లు... లాక్ డౌన్ విధిస్తారా లేదా అంటూ రూ.వేల రూపాయలు దీనిపై బెట్టింగ్ పెడుతుండటం గమనార్హం. కొంతమంది వ్యక్తులు కరోనా తీవ్రతను కూడా క్యాష్‌ చేసుకునే దుర్మార్గానికి ఒడిగడుతున్నారు. సెకండ్‌వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో లాక్‌డౌన్‌ విషయమై భారీగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో బుకీలు బెట్టింగ్‌ దందాకు తెరతీశారు. మే 2 నుంచి దేశంలో లాక్‌డౌన్ ఉంటుందంటూ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. నెలరోజుల పాటు లాక్‌డౌన్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో లాక్‌డౌన్ బెట్టింగ్‌లపై పోలీసులు నిఘాపెట్టారు.

ఇదిలా ఉండగా.. కరోనా కేసులు రోజు రోజుకీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో 2,17,353 కరోనా కేసులు నమోదు కాగా, 1185 మరణాలు సంభవించాయి. ఇక యాక్టివ్‌ కేసుల సంఖ్య 15,69,743గా ఉంది. భారత్‌లో ఇప్పటివరకు 11.72 కోట్ల మందికి పైగా టీకాలు వేయించుకున్నారు. కరోనా బాధితుల రికవరీ రేటు 88.31 శాతంగా ఉండగా మరణాల శాతం 1.23 గా ఉండటం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం