ఎయిమ్స్‌లో కోవాగ్జిన్ హ్యూమన్ ట్రయల్స్: 30 ఏళ్ల వ్యక్తికి తొలి డోసు... బెటర్ రిజల్ట్

By Siva KodatiFirst Published Jul 25, 2020, 5:20 PM IST
Highlights

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో (ఎయిమ్స్) వైరస్‌ను అరికట్టేందుకు గాను మొదటి దశ కోవాగ్జిన్ మెడిసిన్‌ను మనుషులపై ప్రయోగించారు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నకరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ తయారీకి సంబంధించి కొన్ని దేశాల్లో హ్యూమన్ ట్రయల్స్ కూడా ప్రారంభమయ్యాయి.

ఈ పోటీలో భారతదేశం కూడా దూసుకెళ్తోంది. తాజాగా ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో (ఎయిమ్స్) వైరస్‌ను అరికట్టేందుకు గాను మొదటి దశ కోవాగ్జిన్ మెడిసిన్‌ను మనుషులపై ప్రయోగించారు.

Also Read:శివరాజ్ సింగ్ చౌహన్ కు కరోనా: ఆ బారిన పడిన తొలి సీఎం ఈయనే

ఢిల్లీకి చెందిన ఓ స్వచ్ఛంద కార్యకర్తకు 0.5 మిల్లీ లీటర్ల తొలి డొసు ఇంజెక్షన్‌ను ఇచ్చారు. సదరు వాలంటీర్‌కు రెండు రోజుల క్రితం స్క్రీనింగ్ చేయగా.. అందులో అతని ఆరోగ్యం సాధారణంగా ఉందని ఎయిమ్స్ ప్రొఫెసర్, కరోనా వైరస్ రీసెర్చ్ టీం ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ రాయ్ తెలిపారు.

కోవాగ్జిన్‌ను ప్రయోగించిన రెండు గంటల తర్వాత టెస్టులు చేయగా.. అందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని సంజయ్ చెప్పారు. వ్యాక్సిన్‌ను తీసుకున్న వాలంటీర్‌ను వారం రోజుల పాటు తమ అబ్జర్వేషన్‌లో ఉంటాడని, ఇప్పటికే స్క్రీనింగ్ టెస్టులు చేసిన వాలంటీర్ల పరీక్షా నివేదికలు రావాల్సి వుందని సంజయ్ తెలిపారు.

కోవాగ్జిన్ హ్యూమన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు 3,500 మంది వాలంటీర్లు గత శనివారం పేర్లను నమోదు చేసుకున్నారని.. వీరిలో 22 మంది వాలంటీర్లకు స్క్రీనింగ్ టెస్టులు చేసి పరిశీలనలో ఉంచినట్లు డాక్టర్ రాయ్ వెల్లడించారు.

Also Read:భారత్ లో 13లక్షలు దాటిన కరోనా కేసులు.. నిన్న ఒక్కరోజే.

కోవాగ్జిన్ హ్యూమన్  ట్రయల్స్ కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌తో పాటు మొత్తం 12 రీసెర్చ్ సెంటర్లను ఐసీఎంఆర్ సెలక్ట్ చేసింది. ఈ సెంటర్లలో మొదటి దశ, రెండో దశలో కోవాగ్జిన్‌ను ర్యాండమ్‌గా ఫ్లాసిబో టెస్టులు నిర్వహించనున్నట్లు సంజయ్ రాయ్ తెలిపారు.

ఫస్ట్ ఫేజ్‌లో 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న వారిపై ప్రయోగాలు జరపనున్నారు. రెండో ఫేజ్‌లో 16 నుంచి 65 సంవత్సరాల వయసున్న 750 మంది వాలంటీర్లపై ప్రయోగించనున్నారు. ఈ టెస్టుల్లో పాల్గొనేందుకు 1800 మంది వాలంటీర్లు తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారని సంజయ్ రాయ్ వెల్లడించారు. 

click me!