మరో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ ఎన్ కౌంటర్

Published : Jul 25, 2020, 01:06 PM IST
మరో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ ఎన్ కౌంటర్

సారాంశం

టింకూ తలమీద లక్ష రూపాయల రివార్డు కూడా ఉన్నట్లు తెలిపారు. ఆయన వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, 20 ఏళ్లుగా నిషేదిత కార్యక్రమాలను పాల్పడున్నాడని పేర్కొన్నారు. 

ఇటీవల మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దుబేను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందే.. మరో గ్యాంగ్ స్టర్ ని కూడా ఎన్ కౌంటర్ చేశారు. ఒకరి తర్వాత మరొకరిని పోలీసులు నేరగాళ్లను ఏరివేసే పనిలో పడ్డారు. శుక్రవారం రాత్రి బారాబంకీ ప్రాంతంలో స్పెషల్‌ టాస్స్‌ఫోర్స్‌ పోలీసులు జరిపిన కాల్పుల్లో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ టింకూ క‌పాలా మరణించాడు. 

అయితే తొలుత తీవ్రంగా గాయపడ్డ అతను.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందినట్లు స్థానిక ఎస్పీ అరవింద్‌ చతుర్వేది వివరాలను వెల్లడించారు. టింకూ తలమీద లక్ష రూపాయల రివార్డు కూడా ఉన్నట్లు తెలిపారు. ఆయన వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, 20 ఏళ్లుగా నిషేదిత కార్యక్రమాలను పాల్పడున్నాడని పేర్కొన్నారు. 

టింకూ టీంలోని మరికొంత మంది క్రిమినల్స్‌ కోసం ప్రత్యేక బలగాలతో గాలింపు చేపడుతున్నట్లు తెలిపారు. మరోవైపు ఎన్‌కౌంటర్లపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. మాఫియాను ప్రోత్సహిస్తున్న వారి జాబితాను తయారుచేసి వెంటాడుతోంది. కాగా మూడు వారాల క్రితమే కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబేను ఎన్‌కౌంటర్‌లో యూపీ పోలీసులు హతమార్చిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు ఓ కమిటీని సైతం నియమించింది.

PREV
click me!

Recommended Stories

Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM