మేనబావ అని ఆశ్రయిస్తే.. మరదలిపై ఐదేళ్లుగా పోలీసు అత్యాచారం, అయిదుసార్లు అబార్షన్.. చివరికి...

Published : Oct 26, 2022, 08:01 AM IST
మేనబావ అని ఆశ్రయిస్తే.. మరదలిపై ఐదేళ్లుగా పోలీసు అత్యాచారం, అయిదుసార్లు అబార్షన్.. చివరికి...

సారాంశం

పోలీసు కదా తనకు సాయం చేస్తాడని మేనబావను ఆశ్రయించింది ఓ మహిళ. ఆమె అవసరాన్ని ఆసరాగా తీసుకుని అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు ఆ పోలీసు. 

బెంగళూరు : ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీస్ అధికారి వరసకి మరదలు అయిన యువతిపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో చోటు చేసుకుంది. చల్లకేరే పోలీస్ స్టేషన్ లో ఉమేష్ అనే వ్యక్తి  పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. అయితే, ఆస్తి సమస్యను పరిష్కరించే ముసుగులో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత ఐదేళ్లుగా తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు అని వాపోయింది.  

అంతేగాక, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్స్పెక్టర్ తన మేనమామ కుమారుడని, వరుసకు బావ అవుతాడు అని పేర్కొంది. ఉమేష్ ఐదేళ్ల క్రితం దావణగెరె పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో భూ వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ బాధితురాలు నిందితుడిని సంప్రదించింది. ఈ కేసులో సహాయం చేస్తున్నట్లు నటించి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా పలు సందర్భాల్లో బాధితురాలిని బెదిరించి లైంగికంగా వేధిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో యువతి ఐదుసార్లు గర్భం దాల్చగా అబార్షన్ చేయించాడు. 

చిరిగిన రూ.20 నోటు కోసం వాగ్వాదం.. మంటలంటుకుని మహిళ మృతి..

రమేష్ కు ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారని.. తన మూడో పెళ్లి చేసుకుంటానని అతను కోరుతున్నట్లు తెలిపింది. పెళ్లి చేసుకోకుంటే ఆస్తి తనకు దక్కకుండా చేస్తానని బెదిరిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాక తన తల్లిదండ్రులను వీధుల్లోకి లాగుతానని, చెప్పినట్లు వినకుంటే చంపేస్తానని సైతం హెచ్చరిస్తున్నట్లు ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై చిత్రదుర్గ మహిళా పోలీస్ స్టేషన్ లో అత్యాచారం కేసు నమోదైంది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం