Kambala: జల్లికట్టు, కంబళను కాపాడుకుంటేనే సనాతన ధర్మం నిలుస్తుంది: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య

By Mahesh K  |  First Published Nov 26, 2023, 8:38 PM IST

దక్షిణ బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య జల్లికట్టు, కంబళ క్రీడలను సనాతన ధర్మంతో లంకె పెడుతూ మాట్లాడారు. ఈ క్రీడలను కాపాడుకుంటేనే సనాతన ధర్మం నిలుస్తుందని వివరించారు. ఆదివారం బెంగళూరులో విజయవంతంగా రెండో రోజు కంబళ క్రీడ నిర్వహించారు.
 


Kambala: బెంగళూరు సౌత్ ఎంపీ, బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు తేజస్వీ సూర్య ఆదివారం కంబళ, జల్లికట్టు ఆటల గురించి మాట్లాడారు. ఈ ఆటలకు సనాతన ధర్మంతో లంకె ఉన్నదని వివరించారు.అన్ని పార్టీలు ఏకమై సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని పిలుపు ఇచ్చారు. సాంప్రదాయ క్రీడలైన జల్లికట్టు, కంబళను ఆపడానికి కొన్ని శక్తులు ఒక ఎజెండా ప్రకారం పని చేస్తున్నాయని ఆరోపించారు.

నీటిలో దున్నలను అతివేగంగా పరుగెత్తించే ఈ కంబళ ఆట ఈ రోజు బెంగళూరులో రెండో రోజుకు చేరుకుంది. సాధారణంగా ఈ క్రీడ కర్ణాటక తీర ప్రాంతాల్లో, కేరళలోని కాసర్‌గోడ్‌లో నిర్వహిస్తుంటారు. కంబళ బెంగుళూరులో తొలిసారిగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కంబళ రాష్ట్ర క్రీడా హోదాను దక్కించుకుంది.

Latest Videos

Also Read: Barrelakka: బర్రెలక్క వెనుక ఎవరు ఉన్నారు? గెలిస్తే ఏ పార్టీలోకి వెళ్లుతుంది?

‘కొన్ని శక్తులు ఒక ఎజెండాతో జల్లికట్టు, కంబళను ఆపాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. కోర్టులకు వెళ్లుతున్నాయని, ఇతర మార్గాల్లో ఈ క్రీడాలను ఆపడానికి ప్రయత్నిస్తున్నాయి’ అని తేజస్వీ సూర్య అన్నారు. పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి జల్లికట్టు, కంబళను కాపాడుకోవాలని తెలిపారు. ఎందుకంటే ఈ క్రీడలను కాపాడుకుంటేనే సనాతన ధర్మాన్ని పరిరక్షించినవారం అవుతామని వివరించారు. ఈ క్రీడలో 178 మంది వారి దున్నలతో పాల్గొంటున్నారు.

click me!