Ajit Pawar: చీలిన పార్టే అసలైన ఎన్‌సీపీ.. తిరుగుబాటు చేసిన వారిపై అనర్హత వేటు వేయలేం: మహారాష్ట్ర స్పీకర్

By Mahesh K  |  First Published Feb 15, 2024, 6:41 PM IST

అజిత్ పవార్ వర్గమే అసలైన ఎన్‌సీపీ అని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ పేర్కొన్నారు. అజిత్ పవార్ వెంట ఉన్న 41 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేమని స్పష్టం చేశారు. 
 


NCP: మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ గురువారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను పేర్కొంటూ అజిత్ పవార్ ఎన్‌సీపీనే అసలైన ఎన్‌సీపీ అని స్పష్టం చేశారు. కాబట్టి, అజిత్ పవార్ వెంటే ఉన్న 41 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేమని పేర్కొన్నారు.

గతేడాది జూన్‌లో అజిత్ పవార్.. శరద్ పవార్ పై తిరుగుబాటు చేశారు. అజిత్ పవార్ వెంట 41 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపారు. అధికార పక్షంలో నిలిచారు. పార్టీని ధిక్కరించి వారు వెళ్లిపోయారని, మొత్తం 41 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అప్పటి ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ స్పీకర్‌ను కోరారు.

Latest Videos

undefined

ఇటీవలే ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలో మెజార్టీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంటే ఉన్నారని పేర్కొంది. అజిత్ పవార్‌ ఎన్‌సీపీనే అసలైన ఎన్‌సీపీ అని పేర్కొంది. పార్టీ సింబల్, పార్టీ పేరు అజిత్ పవార్ వర్గానికే చెందుతుందని స్పష్టం చేసింది. ఇవే ఆదేశాలను ఉటంకిస్తూ మహారాష్ట్ర స్పీకర్ నర్వేకర్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.

Also Read: Neelam Madhu: బీఆర్ఎస్ టు కాంగ్రెస్ టు బీఎస్పీ.. పటాన్‌చెరులో ‘నీలం’ టికెట్‌పై బరిలో మధు

అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీనే అసలైన ఎన్‌సీపీ పార్టీ అని నర్వేకర్ పేర్కొన్నారు. 41 మంది ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ వద్దే మెజార్టీ శాసన సభ్యులు ఉన్నారని వివరించారు. ఇందులో వివాదమేమీ లేదని తెలిపారు. చీలికకు ముందు ఎన్‌సీపీలో 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 41 మంది అజిత్ వెంట రాగా.. 12 మంది మాత్రమే శరద్ పవార్‌తో ఉన్నారు. 

పార్టీ పేరు ప్రతిపాదనకు ఈసీ శరద్ పవార్‌కు గంటల వ్యవధి ఇచ్చింది. వారు వెంటనే ఎన్‌సీపీ శరద్ చంద్ర పవార్ అని పేర్కొన్నారు. ఎన్‌సీపీ పరిస్థితి కూడా అచ్చం శివసేనలాగే మారింది. ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన ఏక్‌నాథ్ షిండే వర్గమే అసలైన పార్టీ అని తేలిన సంగతి తెలిసిందే. ఏక్‌నాథ్ షిండే వర్గ ఎమ్మెల్యేలనూ అనర్హులుగా ప్రకటించలేదు.

click me!