వాలెంటైన్స్ డే నాడు ఢిల్లీకి చెందిన తరుణ్ అనే నివాసి 16 వేర్వేరు చిరునామాలకు కేక్‌ను పంపించాడు. ఈ విషయాన్ని జొమాటో స్వయంగా ట్వీట్ చేసింది.
Valentines Day: వాలెంటైన్స్ డే రోజున ప్రేమికులంతా కలుసుకుంటారు. ఒకరికొకరు గిఫ్ట్‌లు ఇచ్చిపుచ్చుకుంటారు. గులాబీ పూలు, టెడ్డీ బేర్లు, చాకొలేట్లు, ఇతర స్వీట్లను ఇచ్చి ప్రేమను పంచుకుంటారు. రెండు స్వీట్లు కొనుక్కుని ఇద్దరూ కలిసి తింటారు. కానీ, ఢిల్లీకి చెందిన తరుణ్ ఏకంగా పదహారు కేక్‌లు కొన్నాడు. వేర్వేరు అడ్రస్‌లకు పంపించాడు. అంటే.. 16 మందికి ఆ స్వీట్లను జొమాటో ద్వారా పంపాడు. ఇందుకు సంబంధించి జొమాటో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఢిల్లీకి చెందిన తరుణ్ పేరును పేర్కొంటూ జొమాటో ఎక్స్ హ్యాండిల్ హ్యాపీ వాలెంటైన్స్ డే అని శుభాకాంక్షలు చెప్పింది. అంతటితో ఊరుకోలేదు. ఆయన వాలెంటైన్స్ డే నాడు 16 వేర్వేరు చోట్లకు కేక్‌లను పంపించాడని రివీల్ చేసింది.
undefined
Also Read : BJP : ఏడుగురు కేంద్ర మంత్రులను రాజ్య సభకు తీసుకోవడం లేదు.. బీజేపీలో ఏం జరుగుతున్నది ?
happy valentine's day to Tarun from Delhi who has sent cakes to 16 different addresses today
— zomato (@zomato)ఈ ట్వీట్ పై నెటిజన్లు కామెంట్లు కురిపించారు. తన అవకాశాలను పరీక్షించుకోవడంలో తరుణ్ జొమాటోను సమర్థంగా వాడుకున్నాడని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఇక పలువురు నెటిజన్లు తమకు తెలిసిన తరుణ్‌లను ట్యాగ్ చేస్తూ.. ఇది నీవేనా? అంటూ సందేహాలు వెలిబుచ్చారు. తరుణ్‌కు ఇది మోయే మోయే క్షణం అని ఇంకొకరు.. పాపం తరుణ్ బయటిపడిపోయాడే అని మరొకరు కామెంట్లు చేశారు. కాగా కొందరు మాత్రం జొమాటో ఇలా ఒక వ్యక్తి పేరును మెన్షన్ చేసి ట్వీట్ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.