గవర్నర్ సాబ్.. చూస్తున్నారా, మా బలం ఇది: కాంగ్రెస్, ఎన్సీపీ, సేనల బలప్రదర్శన

By sivanagaprasad KodatiFirst Published Nov 25, 2019, 7:59 PM IST
Highlights

మహారాష్ట్రలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనని దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలు బలప్రదర్శన నిర్వహించాయి.

మహారాష్ట్రలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనని దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలు బలప్రదర్శన నిర్వహించాయి. మొత్తం 162 ఎమ్మెల్యేలతో ముంబై గ్రాండ్ హయత్ హోటల్‌లో ఎమ్మెల్యేలను పరేడ్ చేయించారు.

అంతకుముందు బలపరీక్ష విషయానికి సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మొదటి సారిగా తామంతా ముంబైలోని గ్రాండ్ హయత్‌ హోటల్ వద్ద వున్నామని... సాయంత్రం 7 గంటలకు గవర్నర్ సాబ్.. మీరే వచ్చి చూడొచ్చునని ట్వీట్ చేశారు.

బీజేపీ ప్రలోభాలకు గురికాకుండా మూడు పార్టీలు తమ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించాయి. తాజాగా మీడియా ముందుకు ఎమ్మెల్యేలను తీసుకురావడం ద్వారా తమ బలాన్ని ప్రజల ముందు ఉంచాలన్నది మూడు పార్టీల వ్యూహంగా కనిపిస్తోంది. 

Also Read:మహారాష్ట్ర సంక్షోభం: వాదనలు పూర్తి తీర్పు రేపు ఉదయానికి వాయిదా

ఈ సందర్భంగా ఉద్దవ్ థాక్రే మాట్లాడుతూ... తమ పోరాటం అధికారం కోసం కాదని సత్యం కోసమన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది సంకీర్ణ కూటమేనని, అజిత్‌కు విప్ జారీ చేసే అధికారం లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు.

తమకు 162 మంది ఎమ్మెల్యేల కంటే ఎక్కువ బలం వుందని కాంగ్రెస్ నేత, మాజీ సీఎం అశోక్ చవాన్ తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ తమను ఆభ్వానించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా లాంగ్ లివ్ మహా వికాస్ అఘాడీ అంటూ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. 

కాగా మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సవాల్‌ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ శనివారం సాయంత్రం సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి. దీన్ని అత్యవసరంగా విచారణ జరపవలిసిన పిటిషన్ గా సుప్రీమ్ దీన్ని పరిగణించింది. దీనిపై నిన్నసుప్రీమ్ విచారణ జరిపి నేటికీ వాయిదా వేసింది. 

సుప్రీమ్ వాదనలు పూర్తిగా విన్న తరువాత తీర్పును రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం 10.30కు తీర్పును వెలువరించనున్నట్టు తెలిపింది. 

గవర్నర్ లేఖను, ఎన్సీపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతూ గవర్నర్ కు ఇచ్చిన లేఖను సుప్రీమ్ కోర్టుకు సమర్పించాలని ఎస్జీని సుప్రీమ్ కోర్ట్ ఆదేశించించింది. నేటి ఉదయం 10.30కు ఈ కేసును తిరిగి సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.  

Also Read:మహారాష్ట్రలో మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: శరద్ పవార్ ధీమా

కోర్టుకి వచ్చిన సొలిసిటర్ జనరల్ కోర్టు అడిగిన రెండు లేఖల ఒరిజినల్ కాపీలు తన వద్ద ఉన్నాయని అన్నారు. కోర్టుకు ఆ రెండు లేఖలు సమర్పించిన తరువాత మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులను, రాష్ట్రపతి పాలనకు దారితీసిన కారణాలను తెలిపారు. 

 

click me!