ఇరిగేషన్ స్కాంలో అజిత్ పవార్‌కు క్లీన్ చీట్: క్విడ్‌ప్రోకో అంటూ సేన విమర్శలు

By sivanagaprasad KodatiFirst Published Nov 25, 2019, 4:15 PM IST
Highlights

మహారాష్ట్ర రాజకీయాలను అనూహ్య మలుపు తిప్పిన అజిత్ పవార్‌కు ఊరట లభించింది. ఇరిగేషన్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ క్లీన్‌చీట్ ఇచ్చింది

మహారాష్ట్ర రాజకీయాలను అనూహ్య మలుపు తిప్పిన అజిత్ పవార్‌కు ఊరట లభించింది. ఇరిగేషన్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ క్లీన్‌చీట్ ఇచ్చింది.

70 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలు రావడంతో అప్పట్లో ఏసీబీ విచారణ జరిపింది. అయితే ప్రస్తుతం బీజేపీతో సీక్రెట్ డీల్‌లో భాగంగానే కేసు క్లోజ్ చేశారని శివసేన ఆరోపించింది. అజిత్ పవార్‌ను ఈ కేసుతో బ్లాక్‌మెయిల్ చేసి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారని మండిపడింది.

Also read:మహారాష్ట్ర సంక్షోభం: వాదనలు పూర్తి తీర్పు రేపు ఉదయానికి వాయిదా

ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే అజిత్ పవార్‌పై ఉన్న ఇరిగేషన్ స్కాం ఫైలును ఏసీబీ మూసివేయడం తీవ్ర సంచలనం రేపుతోంది. నవంబర్ 28న ఈ కేసు కోర్టు ముందు విచారణకు రానుంది. ఎఫ్ఐఆర్‌లో అజిత్ పవార్ పేరు లేదు. కాకపోతే కాంట్రాక్ట్‌లకు సంబంధించి ఆయన జోక్యం చేసుకున్నారని ఆరోపణలు రావడంతో పవార్ పాత్రపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. 

కాగా మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సవాల్‌ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ శనివారం సాయంత్రం సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి. దీన్ని అత్యవసరంగా విచారణ జరపవలిసిన పిటిషన్ గా సుప్రీమ్ దీన్ని పరిగణించింది. దీనిపై నిన్నసుప్రీమ్ విచారణ జరిపి నేటికీ వాయిదా వేసింది. 

సుప్రీమ్ వాదనలు పూర్తిగా విన్న తరువాత తీర్పును రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం 10.30కు తీర్పును వెలువరించనున్నట్టు తెలిపింది. 

గవర్నర్ లేఖను, ఎన్సీపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతూ గవర్నర్ కు ఇచ్చిన లేఖను సుప్రీమ్ కోర్టుకు సమర్పించాలని ఎస్జీని సుప్రీమ్ కోర్ట్ ఆదేశించించింది. నేటి ఉదయం 10.30కు ఈ కేసును తిరిగి సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.  

కోర్టుకి వచ్చిన సొలిసిటర్ జనరల్ కోర్టు అడిగిన రెండు లేఖల ఒరిజినల్ కాపీలు తన వద్ద ఉన్నాయని అన్నారు. కోర్టుకు ఆ రెండు లేఖలు సమర్పించిన తరువాత మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులను, రాష్ట్రపతి పాలనకు దారితీసిన కారణాలను తెలిపారు. 

Also Read:డిప్యూటీ సీఎంగా అజిత్ పవర్! .. ఆయన ట్విట్టర్‌ను చూసి షాక్ అవుతున్న నెటిజన్స్

సొలిసిటర్ జనరల్ సమర్పించిన లేఖలు మరాఠీలో ఉన్నాయని వాటితోపాటు ఇంగ్లీష్ తర్జుమాను కూడా సర్పించాడు. దేవేంద్ర ఫడ్నవిస్ తరుపున వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహత్గి వాదిస్తూ, శివసేన మోసం చేసింది కాబట్టి ఎన్సీపీ ఇచ్చిన లేఖతో ఫడ్నవీస్ ముందుకెళ్లారని చెప్పారు. గవర్నర్ రాజ్యరంగా బద్దంగానే వ్యవహరించారని అన్నారు.

ఎన్సీపీ ఎమ్మెల్యేలు సంతకం పెట్టిన లేఖకు మరో పత్రం జతచేసి ఫడ్నవిస్ కు మద్దతు తెలుపుతున్నట్టుగా అజిత్ పవార్ మార్చారని ఎన్సీపీ తరుపున వాదనలు వినిపించిన లాయర్ అంటున్నారు.  

 

click me!