మహారాష్ట్రలో జికా వైరస్ కేసు నమోదు: పుణె మహిళకు సోకిన వ్యాధి

By narsimha lodeFirst Published Aug 1, 2021, 12:24 PM IST
Highlights

మహారాష్ట్రలో కరోనా కేసులతో పాటు జికా వైరస్ కూడ కలవరపెడుతోంది.  పుణెకు సమీపంలోని  బెస్తర్ గ్రామానికి చెందిన వివాహితకు జికా వైరస్ సోకింది. 
 


పుణె:మహారాష్ట్రలో తొలి జికా వైరస్ నమోదైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.పుణె తాలుకాలోని బెస్తర్ గ్రామంలో జికా వైరస్ నమోదైందని మహారాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖాధికారులు తెలిపారు.ఈ నెల మొదటి వారంలో బెస్తర్,పరించ గ్రామాల్లో పలువురి నుండి శాంపిల్స్ సేకరించారు. బెస్తర్ కు సమీపంలోని ఏడు గ్రామాల్లో జికా వైరస్ సహా, డెంగ్యూ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించారు. బెస్తర్ గ్రామానికి చెందిన వివాహితకు జికా వైరస్ సోకిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

జికా వైరస్ సోకిన బాధితురాలు ఇంటి వద్దే ఉంది. ఇటీవల కాలంలో ఎక్కడికి ప్రయాణం చేయలేదని వైద్యులు చెప్పారు. జూలై 14న ఆమెకు జికా  వైరస్ లక్షణాలున్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతం ఆమె కోలుకొందని వైద్యాధికారులు తెలిపారు. ఆమె కుటుంబసభ్యులకు కూడ ఎలాంటి లక్షణాలు కన్పించలేదని వైద్యాధికారి ప్రదీప్ అవంతే చెప్పారు.దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐసీఎంఆర్, ఎన్ఐవీ బృందం,  బెస్లారీ, పరించి గ్రామాల్లో జూలై 27 -29 మధ్య పలువురి నుండి రక్త నమూనాలు సేకరించారు. వీరిలో ఎక్కువ మందికి చికెన్ గున్యా సోకినట్టుగా తేలింది. ఇంకా కొంత మంది బ్డడ్ శాంపిల్స్ రిపోర్టులు రావాల్సి ఉంది.

click me!