పెగాసెస్‌పై కీలక పరిణామం: ఆగష్టు 4 నుండి సుప్రీం విచారణ

By narsimha lodeFirst Published Aug 1, 2021, 11:19 AM IST
Highlights

పెగాసెస్ అంశంపై  ఆగష్టు 4వ తేదీ నుండి విచారణ నిర్వహిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. జర్నలిస్టులు ఎన్., రామ్, శశికుమార్  తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది.

న్యూఢిల్లీ:పెగాసెస్ అంశంపై కీలక పరిణామం చోటు చేసుకొంది. ఆగష్టు 4వ తేదీ నుండి ఈ విషయమై విచారణ జరపుతామని సుప్రీంకోర్టు ప్రకటించింది.విపక్షనేతలు, జర్నలిస్టులు, కేంద్రమంత్రుల  ఫోన్లను  పెగాసెస్ సాఫ్ట్ వేర్ ఆధారంగా హ్యాక్ చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి.ఈ కథనాలపై చర్చకు పార్లమెంట్ లో విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. పెగాసెస్ అంశంపై విచారణ జరిపించాలని పార్లమెంట్ ఉభయ సభలను విపక్షాలు స్థంభింపజేస్తున్నాయి.

also read:పెగాసెస్‌పై దర్యాప్తునకు సుప్రీం ఓకే: వచ్చే వారంలో విచారణ

పెగాసెస్ పై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని జర్నలిస్టులు ఎన్ రాము, శశికుమార్ లు  సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై  విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు.ఆగష్టు 4వ తేదీ నుండి విచారణ ప్రారంభిస్తామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల ధర్మాసనం విచారణ చేయనుంది.ఇండియాకు చెందిన 142 మందికి పైగా వ్యక్తులు పెగాసెస్ సాఫ్ట్‌వేర్ సహయంతో  హ్యాకింగ్ చేశారని  మీడియా కథనాలు ప్రచురించింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ ఇద్దరు కేంద్ర మంత్రులు, మాజీ ఎన్నికల కమిషనర్, 40 మంది జర్నలిస్టుల ఫోన్లు హ్యాకయ్యాయని మీడియా తెలిపింది.


 

click me!