Omicron: మహారాష్ట్రలో ఒక్కరోజే 85 ఒమిక్రాన్ కేసులు.. ఏపీ, తెలంగాణల్లో ఎన్నంటే?

By Mahesh Rajamoni  |  First Published Dec 30, 2021, 1:26 AM IST

Omicron: ప్ర‌పంచంలోని ప‌లు దేశాల్లో క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ పంజా విసురుతోంది. భార‌త్ లోనూ ఈ వేరియంట్ కేసులు క్ర‌మంగా పెరుగుతుండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌హారాష్ట్రలో ఒక్క‌రోజే కొత్త‌గా 85 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు న‌మోదుకావ‌డంతో స్థానికంగా భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 
 


Omicron: ద‌క్షిణాఫ్రికాలో న‌వంబ‌ర్ చివ‌రి వారంలో వెలుగుచూపిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌పంచ దేశాలను  తీవ్ర క‌ల‌వ‌రానికి గురించేస్తున్న‌ది. ఇప్ప‌టికే ప‌లు దేశాల్లో అత్యంత వేగంగా విస్త‌రిస్తున్న ఒమిక్రాన్‌.. భార‌త్ లోనూ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దీంతో ఈ వేరియంట్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. మ‌హారాష్ట్రలో ఈ కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయి. కేవ‌లం ఒక్క‌రోజే కొత్తగా 85 ఒమిక్రాన్ కేసులు న‌మోదుకావ‌డం స్థానికంగా భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 85 ఒమిక్రాన్‌ కేసులు రావడం కలకలం రేపుతోంది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 252కి పెరిగింది. తాజాగా వచ్చిన వాటిలో ముంబయిలోనే అత్యధికంగా 53 కేసులు వెలుగుచూశాయ‌ని అధికారులు వెల్ల‌డించారు. పూణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (NIV) ల్యాబ్‌లో జీనోమ్‌ సీక్వెనింగ్‌లో 47 మందికి ఒమిక్రాన్‌ నిర్ధారణ కాగా.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చి (IISER)లో జరిపిన పరీక్షల్లో మరో 38 మందికి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకినట్టు వైద్యులు వెల్లడించారు.

Also Read: Omicron: కొద్ది రోజుల్లో విస్ఫోటనంలా క‌రోనా కేసులు.. థ‌ర్డ్ వేవ్.. : కేంబ్రిడ్జ్ స‌ర్వే షాకింగ్ విష‌యాలు

Latest Videos

undefined

ఇప్ప‌టివ‌ర‌కు అంత‌ర్జాతీయ ప్ర‌యాణాలు చేసిన వారిలోనే ఒమిక్రాన్ వేరియంట్ సోనిన కేసుల‌ను గుర్తించ‌బ‌డ్డాయి. అయితే, తాజా IISER నివేదికల్లో పాజిటివ్‌గా తేలిన 38 మందికీ అంతర్జాతీయంగా ఎలాంటి  ట్రావెల్‌ హిస్టరీ లేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు.  అలాగే, పూణే ల్యాబ్‌ నుంచి వచ్చిన నివేదికలకు సంబంధించిన 47 మంది బాధితుల్లో 43 మంది అంతర్జాతీయ ప్రయాణికులు కాగా.. నలుగురు కాంటాక్టులకు ఒమిక్రాన్‌ సోకిందని ఆధికారులు తెలిపారు. గుజ‌రాత్‌, రాజ‌స్థాన్, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనూ కొత్త‌గా ఒమిక్రాన్ కేసులు రెండ‌కెల్లో న‌మోద‌య్యాయి. ఉత్త‌ర‌భార‌త రాష్ట్రమైన రాజ‌స్థాన్ లో కొత్త‌గా 23 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒక్క అజ్మేర్‌ నుంచే 10 కేసులు రాగా.. రాజధాని జైపుర్‌ నుంచి 9 కేసులు వచ్చాయని వైద్యాధికారులు వెల్లడించారు. వారిలో  ఇద్దరు భిల్వాడా నుంచి, అల్వార్‌, జోధ్‌పుర్‌ నుంచి ఒకరు చొప్పున ఉన్నట్లు తెలిపారు. ఒమిక్రాన్ బారినప‌డ్డ వారిని రాజ‌స్థాన్  యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (RUHS) ఆస్ప‌త్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. ఇక కొత్త కేసుల‌తో క‌లిపి రాజ‌స్థాన్ లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 69కి పెరిగాయి. 

Also Read: CAG report: ఐఐటీల ఆవ‌స్థ‌లు.. గ్రాంట్ల కోసం ప్ర‌భుత్వం వైపే చూపు.. ఆర్థిక నిర్వ‌హ‌ణ‌లో లోపాలు: కాగ్‌ నివేదిక

ప్ర‌ధాని స్వ‌రాష్ట్రమైన గుజ‌రాత్ లోనూ క‌రోనా వైర‌స్ ఒమిక్రాన్ వేరియంట్ కొత్త కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయి. బుధ‌వారం ఒక్క‌రోజే కొత్త‌గా19 మందికి ఒమిక్రాన్‌గా సోకిన‌ట్టు  నిర్ధరణ అయినట్లు అక్కడి వైద్యాధికారులు వెల్లడించారు.  ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో పెద్ద‌గా తీవ్ర లక్షణాలు లేవని తెలిపారు.  అలాగే, రెండు తెలుగురాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. బుధవారం ఒక్కరోజే ఏపీలో అత్యధికంగా 10 కేసులు రావడం కలకలం రేపుతోంది. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 16కి చేరింది. కొత్త కేసుల్లో అధికం  కువైట్‌, నైజీరియా, సౌదీ, అమెరికా నుంచి వచ్చిన వారిలో నిర్ధారణ అయినట్టు వైద్యశాఖ అధికారులు అధికారులు ల్లడించారు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 38,023 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 235 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,81,307కి చేరింది. రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్‌ బాధితుల సంఖ్య 63కి చేరింది. బాధితుల్లో 46 మంది టీకా తీసుకోలేదని తెలంగాణ సర్కారు వెల్లడించింది 

Also Read: సీబీఐ, ఈడీ చీఫ్‌ల ప‌ద‌వీకాల పొడిగింపు ఆర్డినెన్సులు.. ఆ సమాచారం ఇవ్వడానికి కుదరదు !

click me!