Covid third wave: కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్నది. ఇదివరకు డెల్టా వేరియంట్ కల్లోలం రేపగా, ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతోంది. భారత్ లోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యూకేలోని కేంబ్రిడ్జ్ యూనివర్సీటి ట్రాకర్ సర్వే షాకింగ్ విషయాలు వెల్లడించింది. భారత్ లో మరి కొద్ది రోజుల్లో కోవిడ్ కొత్త కేసుల విస్పోటనం జరుగుతుందని హెచ్చరించింది.
Covid third wave: కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్నిసంక్షోభంలోకి నెట్టింది. 2019లో చైనాలో వెగులుచూసిన ఈ వేరియంట్ కట్టడి కోసం ఇప్పటికే పలు రకాల టీకాలు, మందులు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. దీని వ్యాప్తి తగ్గడం లేదు. అనేక మ్యూటేషన్లకు లోనవుతూ మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా దేశాల్లో పంజా విసురుతోంది. భారత్ లోనూ ఈ రకం కేసులు పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటూ.. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ఆంక్షలు విధిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ యూనివర్సీటీ ఇండియా ట్రాకర్ ఆధారంగా షాకింగ్ విషయాలు వెల్లడించింది. అతి త్వరలోనే.. కొద్ది రోజుల్లోనే భారత్ లో కరోనా కొత్త కేసుల విస్పోటం మొదలవుతుందని పేర్కొంది. దీని కారణంగా నిత్యం లక్షలాది కేసులు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. దాదాపు 140 కోట్ల జనాభా కలిగిన భారత్ లో ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావం మొదలైందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. మరికొద్ది రోజుల్లోనే కొత్త కేసుల విస్పోటనం (కరోనా వైరస్ థర్డ్ వేవ్) మొదలవుతుందని హెచ్చరించారు.
undefined
ఒమిక్రాన్ కారణంగా భారత్ లో కరోనా వైరస్ కొత్త కేసులు విస్పోటం త్వరలోనే ప్రారంభం కానుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. అయితే, ఈ కరోనా వేవ్ వ్యవధి మాత్రం చాలా తక్కువగానే ఉంటుందని తెలిపారు. భారత్ లో కరోనా కొత్త కేసుల పెరుగుదల విషయం గురించి కేంబ్రిడ్జ్ వర్సిటీ జడ్జ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ పాల్ కట్టుమన్ మాట్టాడుతూ.. ‘భారతదేశం రోజువారీ కేసులలో విస్ఫోటనం వృద్ధిని చూసే అవకాశం ఉంది.. తీవ్రమైన వృద్ధి దశ సాపేక్షంగా తక్కువగా ఉంటుంది’ అని అన్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కొద్ది రోజుల్లోనే రికార్డు స్థాయిలో పెరుగుతాయని ఆయన అంచనా వేశారు. అయితే, నిత్యం ఏ స్థాయిలో కొత్త కేసులు నమోదు అవుతాయనేది అంచనా వేయడం చాలా కష్టమని కట్టుమన్ అభిప్రాయపడ్డారు. కోవిడ్-19 ఇండియా ట్రాకర్‌ను అభివృద్ధి చేసిన కేంబ్రిడ్జ్ వర్సిటీ పరిశోధకులు దాని ఆధారంగా ఈ అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్ రేటు వేగంగా పెరుగుతున్నట్టుగా పరిశోధకులు గుర్తించారు.
Also Read: సీబీఐ, ఈడీ చీఫ్‌ల పదవీకాల పొడిగింపు ఆర్డినెన్సులు.. ఆ సమాచారం ఇవ్వడానికి కుదరదు !
కోవిడ్-19 ఇండియా ట్రాకర్ వివరాల ప్రకారం.. డిసెంబరు 24 నాటికి భారత్ లోని ఆరు రాష్ట్రాల్లో వైరస్ ఆందోళనకరంగా ఉండగా.. వైరస్ రేటు 5 శాతం కంటే ఎక్కువగా ఉన్నదని పరిశోధకులు గుర్తించారు. ఇది డిసెంబరు 26 నాటికి 11 రాష్ట్రాలకు విస్తరించిదని తెలిపారు. ఇక దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు మొత్తం 800లకు పైగా ఒమిక్రాన్ కేసులు భారత్ లో నమోదయ్యాయి. ఇదివరకు ఈ ట్రాకర్ ఆధారంగానే క్రేంబిడ్జ్ పరిశోధకులు కరోనా సెకండ్ వేవ్‌ను అంచనా వేశారు. వ్యాక్సినేషన్ కవరేజ్ తగినంతగా పెరిగే వరకు భారతదేశంలో కోవిడ్ ఇన్ఫెక్షన్లు నెమ్మదించవని ఆగస్టులో అంచనా వేసింది. అక్టోబరు నాటికి దేశంలో కోటి డోస్‌లు పంపిణీ జరగ్గా.. అప్పటి నుంచి కొత్త కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే పలు అధ్యయనాలు, నిపుణులు జనవరి మధ్యలో దేశంలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఇదిలావుండగా, డబ్ల్యూహెచ్ వో ఇప్పటికే పలుమార్లు ఒమిక్రాన్ వేరియంట్ గురించి తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక కరోనా కట్టడి కోసం దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి.
Also Read: Omicron:ముంచుకొస్తున్న ఒమిక్రాన్ ముప్పు.. హెల్త్ కేర్ సిస్టమ్ ప్రమాదంలో పడొచ్చు: డబ్ల్యూహెచ్‌వో