"ప్రతిపక్షం ఐక్యంగా ఉంది": అమెరికాలో రాహుల్ గాంధీ

By Rajesh KarampooriFirst Published Jun 2, 2023, 2:21 AM IST
Highlights

ప్రతిపక్షాలు ఒక్కటయ్యాయని, పూర్తి స్థాయిలో ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ అన్నారు. విపక్షాలన్నింటినీ ఏకం చేసేందుకు చర్చలు జరుపుతున్నామని చెప్పారు. 

ప్రతిపక్షాలు ఒక్కటయ్యాయని, పూర్తి స్థాయిలో ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ అన్నారు. విపక్షాలన్నింటినీ ఏకం చేసేందుకు చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ప్రతిపక్షాలు పూర్తిగా ఏకం కావాలని ఆయన ఆకాంక్షించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ వాషింగ్టన్ డీసీలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విపక్షాలు ఐక్యంగా ఉన్నాయని సమాధానమిచ్చారు. విపక్షాలు చాలా బాగా ఏకమయ్యాయనీ, అవి మరింతగా ఏకం కావాలని భావించారు.  

భారతదేశంలో చాలా బలమైన వ్యవస్థలు ఉన్నాయని, అవి ఇప్పటికే అమల్లో ఉన్నాయని, కానీ,  ఆ వ్యవస్థలు బలహీనంగా మారాయని రాహుల్ గాంధీ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రోత్సహిస్తే ఈ సమస్యలు స్వయంచాలకంగా పరిష్కారమవుతాయనీ, ఒత్తిడి, నియంత్రణలో లేని స్వతంత్ర సంస్థలు కేంద్రం చేతి ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  


పత్రికా స్వేచ్ఛపై రాహుల్ ఏమన్నారు?

పత్రికా స్వేచ్ఛ గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ నిర్వీర్యమవుతోందని, ఇది దాపరికం కాదని, ఈ విషయం అందరికీ తెలుసని అన్నారు. ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ ముఖ్యమని తాను భావిస్తున్నానని, విమర్శలు వినాలని అన్నారు. ఇది పత్రికా స్వేచ్ఛ మాత్రమే కాదని, ప్రతిచోటా జరుగుతోందని కాంగ్రెస్‌ నేత అన్నారు. 

click me!