మద్యం ప్రియులకు ఇది చేదు వార్తే. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని మందుబాబులు సద్వినియోగం చేసుకోలేకపోయారు. భౌతిక దూరం పాటించలేదు. గుంపులు గుంపులుగా మద్యం దుకాణాల వద్ద ఎగబడ్డారు.కరోనా పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతుండడంతో దీంతో ముంబైలో మద్యం దుకాణాలను మూసివేశారు.
ముంబై: మద్యం ప్రియులకు ఇది చేదు వార్తే. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని మందుబాబులు సద్వినియోగం చేసుకోలేకపోయారు. భౌతిక దూరం పాటించలేదు. గుంపులు గుంపులుగా మద్యం దుకాణాల వద్ద ఎగబడ్డారు.కరోనా పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతుండడంతో దీంతో ముంబైలో మద్యం దుకాణాలను మూసివేశారు.
కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలపై సడలింపులు ఇచ్చింది. ఈ సడలింపులో భాగంగా ముంబైలో లిక్కర్ షాపులను ఓపెన్ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం.ముంబైలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చింది. ప్రతి రోజూ వందలాది కేసులు నమోదౌతున్నాయి. దీంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కరోనా నివారణ చర్యలను పకడ్బందీగా చర్యలు చేపట్టేందుకు సర్కార్ జాగ్రత్తలు తీసుకొంటుంది.
also read:తెలంగాణలో తెరుచుకున్న వైన్ షాపులు: చాంతాడులా క్యూలు
ముంబై పట్టణంలో మద్యం దుకాణాల వద్ద వందలాది మంది గుమికూడుతున్నారు. దీంతో ప్రభుత్వం లిక్కర్ షాపులను మూసివేసింది. నెలన్నర రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరవడంతో పెద్ద ఎత్తున లిక్కర్ దుకాణాల వద్ద ప్రజలు గుంపులుగా చేరారు. భౌతిక దూరాన్ని పాటించలేదు.
ఈ రకమైన చర్యలతో కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రభుత్వం భావించింది. లిక్కర్ షాపుల వద్ద జనాన్ని కంట్రోల్ చేయడం సాధ్యం కాకపోవడంతో లిక్కర్ షాపులను మూసివేయడమే మేలని భావించినట్టుగా సర్కార్ తేల్చి చెప్పింది.
నిత్యావసర దుకాణాలు మినహా ఇతర దుకాణాలను మూసివేస్తున్నట్టుగా ముంబై మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ పర్ధేశి ప్రకటించారు. మెడికల్ షాపులు మాత్రం తెరిచే ఉంటాయని అధికారుల తెలిపారు. మహారాష్ట్రలో కరోనా కేసులు 9 వేలు దాటాయి. ముంబైలో అత్యధిక కేసులు నమోదౌతున్నాయి.