
Minor girl raped: రోజురోజుకు చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కామంతో కళ్ళు మూసుకుపోయి.. మృగాళ్లలా మారుతున్నారు. విక్షణ మరిచి దారుణాలకు పాల్పడుతున్నారు. వావివరుసలు, చిన్నాపెద్ద తేడా మరిచి కామాంధులుగా మారుతున్నారు. తాజాగా సమాజం సిగ్గుతో తలదించుకునే దారుణ ఘటన జరిగింది. కంచే చేను మేసిందన్న చందంగా దారుణంగా ప్రవర్తించాడో దుర్మార్గుడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న కూతురిపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. అభం శుభం తెలియని చిన్నారిపై మృగాడిలా దాడి చేసి..కామవాంఛ తీర్చుకున్నారు. పైగా దిక్కున్న చోటచెప్పుకొమని బెదిరించాడు. ఈ వార్త చదువుతుంటేనే.. రక్తం మరుగుతోంది కాదా.. ? అలాంటి వారిని నడి రోడ్డులో ఊరి తీయాలని, వారి తరుపున ఏ న్యాయవాది కూడా వాదించకూడదనేలా ఆగ్రహం వ్యక్తమవుతోంది కాదా..? ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన మహారాష్ట్రలోని పూనేలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పూణె నగరంలోని సుస్‌గావ్ ప్రాంతంలోని ఓ వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. మద్యానికి బానిసైన ఆ వ్యక్తి.. ఇంటికి వచ్చి.. తరుచు తన భార్య, పిల్లలతో గొడవపడేవాడు. ఈ క్రమంలో గత నెల కిత్రం .. సదరు వ్యక్తి తీవ్రంగా తాగి వచ్చి... తన భార్యతో గొడవపడి.. తీవ్రంగా దాడి చేశాడు. దీంతో ఆమె.. తన కూతురు, కొడుకును విడిచి పెట్టిన తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మార్చి 13, 14 తేదీల్లో తాగి వచ్చిన వ్యక్తి తన కూతురుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో ఆ బాలిక తన అమ్మ, అమ్మమ్మ దగ్గరకు వెళ్లి జరిగిన దారుణాన్ని వివరించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకున్నారు.
బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు.. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై 376 ఏబీ (12 ఏళ్లలోపు మహిళపై అత్యాచారానికి శిక్ష), 377 (అసహజ నేరాలు), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇలాంటి ఘటననే తెలంగాణలో కూడా జరిగింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే .. కూతురిపైనే అత్యాచారం చేసిన రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలో జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం హైదరాబాద్ కు వలస వచ్చి.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్‌పూర్ గ్రామంలో నివాసం ఉంటుంది. కూలీ పనులు చేసుకుంటూ.. ఉన్నదానిలో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తన తొమ్మిదేళ్ల కూతురిపై కన్నేసిన కీచక తండ్రి. ఇంట్లో ఎవరూ లేనిది చూసి.. కూతురిపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన గురువారం సాయంత్రం జరిగింది.
తల్లి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూతురు జరిగిన దారుణాన్ని చెప్పడంతో.. ఆమె భర్తను నిలదీసింది. ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా వ్యవహరించి.. భార్య, కూతురిపై దాడికి తెగబడ్డాడు. దిక్కున్నచోట చెప్పుకోమంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో స్థానికుల సాయంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడంతో కీచక తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.