
Vivek Agnihotri: కశ్మీర్ ఫైల్స్ అనే సినిమాకు దర్శకత్వం వహించి.. దేశ మొత్తం దృష్టిని తన వైపు ఆకర్షించాడు చిత్రనిర్మాత వివేక్ అగ్నిహోత్రి. తాజాగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. చిక్కుల్లో పడ్డారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ ప్రజలు హోమో సెక్సువల్స్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో ఏం అన్నారంటే.. ‘నేను భోపాల్‌లో పెరిగాను, కానీ నేను భోపాలీని కాదు. అందుకే , ఎక్కడా ఈ విషయాన్ని చెప్పను. ఎందుకంటే భోపాలీకి వేరే అర్థం ఉంది. మీరు ఏదైనా భోపాలీని అడగవచ్చు. ఎందుకంటే భోపాలీలు అంతా హోమో సెక్సువల్స్( స్వలింగ సంపర్కులు) లా వ్యవహరిస్తుంటారు. వారు నవాబుల ప్రవర్తన కలిగి ఉంటారు’’ అని వివేక్ అగ్నిహోత్రి వ్యాఖ్యానించారు.
ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు శుక్రవారం భోపాల్ పర్యటనకు వచ్చే ముందు ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. దీంతో ఆయనపై పలువురు రాజకీయ నేతలు సహా భోపాలీలు, నెటిజన్లు మండిపడుతున్నారు. తాజాగా.. అగ్నిహోత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "వివేక్ అగ్నిహోత్రి జీ, మీకు,వ్యక్తిగతంగా అలాంటి అనుభవం ఉందేమో. కానీ, భోపాల్ ప్రజలెవరికీ లేదు. నేను 1977 నుండి భోపాల్ నగరంతో, భోపాలీలతో నాకు అనుబంధం ఉంది. కానీ, నాకు మీ లాంటి అనుభవం లేదు " అని సింగ్ ట్వీట్ చేశాడు.
డైరెక్టర్ అగ్నిహోత్రి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. చాలా మంది భోపాల్ నెటిజన్లు అతని విపరీతమైన వ్యాఖ్యను ప్రశ్నించారు. భోపాల్ రాజా భోజ్ యొక్క సాంస్కృతిక వారసత్వమనీ, భోపాల్ అనేక చారిత్రక కట్టడాలను నిలయం
కళలు, సంస్కృతికి ప్రసిద్ధి చెందిందని, అగ్నిహోత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని రాష్ట్ర మాజీ మంత్రి పిసి శర్మ డిమాండ్ చేశారు. అగ్నిహోత్రి భోపాల్ ప్రజలు "స్వలింగ సంపర్కులని పదాలను ఉపయోగించి నేరానికి పాల్పడ్డారని ఆయన అన్నారు.
ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహాన్ని ఎదుర్కొన్న మరికొందరు సినీ నిర్మాతల విషయంలో లాగా, అలాగే.. రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మిశ్రా అగ్నిహోత్రిపై చర్యలు తీసుకుంటారా ? లేదా? అని ఎంపీ కాంగ్రెస్ మీడియా ఇన్‌ఛార్జ్ కెకె మిశ్రా ప్రశ్నించారు. భోపాల్ యూనిట్ ప్రెసిడెంట్ అభిమన్యు తివారీ నేతృత్వంలోని నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) కార్యకర్తలు మిస్టర్ అగ్నిహోత్రికి సంబంధించిన పోస్టర్లను తగులబెట్టారు. అతడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మీడియా సెల్ వైస్ ప్రెసిడెంట్ భూపేంద్ర గుప్తా అగ్నిహోత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. భోపాల్‌లోని 25 లక్షల మంది వాసులను అవమానించారని, బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అగ్నిహోత్రితో కలిసి ఎటువంటి బహిరంగ కార్యక్రమంలో పాల్గొనవద్దని డిమాండ్ చేశారు.