మద్యం కొనేందుకు అర్హులకే లైసెన్స్ ఇవ్వాలి - తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు సూచన

By team teluguFirst Published Jan 7, 2023, 8:05 AM IST
Highlights

21 ఏళ్లలోపు యువకులు కూడా మద్యం సేవిస్తున్నారని, మద్యానికి బానిస అవుతున్నారని మద్రాస్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మద్యం కొనేందుకు అర్హత ఉన్న వారికి మాత్రమే లైసెన్స్ మంజూరు చేసి, వాటి ద్వారానే మద్యం అమ్మకాలు జరపాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. 

21 ఏళ్లలోపు వారికి మద్యం అమ్ముతున్నారని మద్రాసు హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. 21 ఏళ్ల నిండిన వారికి మాత్రమే మద్యం కొనుగోలు చేసేందుకు లైసెన్స్ లు ఇవ్వాలని సూచించింది. మద్యం దుకాణాలు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని తెలిపింది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) కొనుగోలు చేయడానికి లైసెన్సింగ్ వ్యవస్థను విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు డైరెక్టర్ జనరల్ ను ఆదేశించాలని జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ జె సత్య నారాయణ ప్రసాద్ లతో కూడిన డివిజన్ బెంచ్ కేంద్రానికి సూచించింది.

ఘోరం.. బైక్ ఎక్కలేదని మహిళను హెల్మెట్ తో చితకబాదిన వ్యక్తి.. వీడియో వైరల్

తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టాస్మాక్) దుకాణాలు, పబ్లు, పర్మిట్ బార్ల పనిగంటలపై ఆంక్షలు విధించాలని కోరుతూ న్యాయవాది బి రామ్కుమార్ ఆదిత్యన్, సామాజిక కార్యకర్త కెకె రమేష్ దాఖలు చేసిన రెండు పిటిషన్లను విచారించిన న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఐఎంఎఫ్ఎల్ అమ్మకం, కొనుగోలు, వినియోగాన్ని నియంత్రించడానికి లైసెన్సింగ్ వ్యవస్థను అమలు చేసేలా తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరారు.

ఆశ్చర్యానికి గురి చేసిన సీజేఐ.. తొలిసారి ఇద్దరు కుమార్తెలతో సుప్రీంకోర్టుకు ..

‘‘చట్టపరమైన హెచ్చరికలు భయాన్ని కలిగించడానికి ఉద్దేశించినవి. కాని అవి మద్యపానం పట్ల మానవ వైఖరులు, ప్రవర్తనపై చాలా తక్కువ ప్రభావాన్ని చూపాయి. 21 ఏళ్లలోపు వారికి మద్య నిషేధం అముల్లో ఉన్నప్పటికీ వారిలో చాలా మంది మద్యానికి బానిసలు కావడం విచారకరం. అందువల్ల మద్యం అమ్మకాలు, వినియోగాన్ని పరిమితం చేయడం, సమర్థవంతంగా నియంత్రించడం, మద్యం వ్యసనాన్ని తగ్గించడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత’’ అని కోర్టు తెలిపింది.

ముంబై విమానాశ్రయంలో రూ.47 కోట్ల విలువైన హెరాయిన్, కొకైన్ స్వాధీనం.. ఇద్దరు స్మగ్లర్ల అరెస్టు

మద్యం వినియోగం గణనీయంగా తగ్గలేదని, బదులుగా రోజు రోజుకు పెరుగుతుందని మద్రాస్ హైకోర్టు గుర్తించి ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని  పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 ప్రకారం పోషకాహారం, జీవన ప్రమాణాలు పెంచడం, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని ధర్మాసనం తెలిపింది. 

జోషీమఠ్ లో 600 ఇళ్లకు పగుళ్లు.. ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం

మత్తు పానీయాలు, ఆరోగ్యానికి కోసం ఉపయోగించే ఔషధ ప్రయోజనాల కోసం మినహా మద్యం వినియోగంపై నిషేధం తీసుకురావడానికి రాష్ట్రం ప్రయత్నించాలని కోర్టు సూచించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఆల్కహాలిక్ బేవరేజస్) రెగ్యులేషన్స్ 2018, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ప్యాకింగ్ అండ్ లేబులింగ్) రెగ్యులేషన్స్ 2011 కింద లేబులింగ్ ఆవశ్యకతలను టాస్మాక్ ఖచ్చితంగా పాటించాలని కోర్టు తెలిపింది.
 

click me!