ఆశ్చర్యానికి గురి చేసిన సీజేఐ..  తొలిసారి ఇద్దరు కుమార్తెలతో సుప్రీంకోర్టుకు .. 

By Rajesh KarampooriFirst Published Jan 7, 2023, 6:10 AM IST
Highlights

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తన ఇద్దరు కుమార్తెలతో శుక్రవారం కోర్టుకు చేరుకున్నారు. ఇద్దరికీ ముందుగా తమ ఛాంబర్ చూపించి, ఆ తర్వాత కోర్టు గది మొత్తం చూపించారు. ఈ సమయంలో ప్రధాన న్యాయమూర్తి అతని పని ఏమిటి? సీనియర్ న్యాయమూర్తులు ఎక్కడ కూర్చుంటారో, న్యాయవాదులు ఎక్కడ నిలబడి తమ వాదనలు వినిపిస్తారో వివరించారు.

భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ శుక్రవారం సుప్రీంకోర్టు జడ్జీలను ఆశ్చర్యానికి గురి చేశారు. ఆయన తన ఇద్దరు దత్తపుత్రికలతో కలిసి కోర్టుకు రావడం అందర్నీ ఆశ్చర్యానికి లోనుచేసింది. ప్రియాంక (20), మహి (16) అనే ఇద్దరు దివ్యాంగులను జస్టిస్ చంద్రచూడ్ దత్తత తీసుకుని తన కుమార్తెలుగా పెంచుకుంటున్నారు. కాగా, శుక్రవారం ఉదయం తన ఇద్దరు కుమార్తెలతో కలిసి సుప్రీంకోర్టుకు వచ్చారు.

వర్గాల సమాచారం ప్రకారం.. జస్టిస్ చంద్రచూడ్ ఉదయం 10 గంటలకు కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు.ఆయన  తన కుమార్తెలను ఉదయం 10.30 గంటలకు షెడ్యూల్ చేసిన కోర్టు సమయానికి ముందే సందర్శకుల గ్యాలరీ ద్వారా వారు కోర్టులోకి ప్రవేశించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఒకటో గదిలోని సీజేఐ కోర్ట్‌కు వెళ్ళారు. అక్కడ తన ఛాంబర్‌కు తీసుకెళ్లి, తన పని స్థలం గురించి వారికి వివరించినట్లు వర్గాలు తెలిపాయి. న్యాయమూర్తులు కూర్చునే ప్రదేశాన్ని, న్యాయవాదులు తమ కేసులను వాదించే చోటును ఆయనకు చూపించారట. కుమార్తెలు తమ పని స్థలాన్ని తండ్రి నుండి చూడాలని తమ కోరికను వ్యక్తం చేశారట. జస్టిస్ చంద్రచూడ్ కుమార్తెలిద్దరికి కోర్టు చూపిస్తూ.. పనితీరును వివరించారనీ, అనంతరం ఆయన వారిద్దరినీ తన చాంబర్‌కు తీసుకెళ్ళి కాసేపు ముచ్చటించారని వర్గాలు తెలిపాయి.

సీజేఐ ప్రస్తానం

జస్టిస్ డివై చంద్రచూడ్ తండ్రి యశ్వంత్ విష్ణు చంద్రచూడ్. ఆయన  16వ ప్రధాన న్యాయమూర్తి సేవలందించారు. జనవరి 22 ,1978 నుండి జూలై 11, 1985 వరకు దాదాపు ఏడేళ్లపాటు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. ఇప్పటి వరకు సుదీర్ఘ పదవీ కాలం సీజేఐకా వ్యవహరించిన ఘనత ఆయన సొంతం. తన తండ్రి పదవీ విరమణ చేసిన దాదాపు  37 ఏళ్ల తర్వాత ఆయన వారసుడుగా డీవై చంద్రచూడ్ సీజేఐ పదవీ బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టు చరిత్రలో తండ్రి, కొడుకు సీజేఐ అయ్యే అరుదైన అవకాశం వీరికే దక్కింది.  జస్టిస్ డీవై చంద్రచూడ్ 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు.

అంతకు ముందు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా మొదటి నియామకం జరిగింది. అంతకు ముందు అతను 1998 నుండి 2000 వరకు భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశాడు. 1982లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయ పట్టా పొందారు. ఆయన ప్రతిష్టాత్మక హోవార్డ్ విశ్వవిద్యాలయంలో కూడా చదువుకున్నాడు.
 

click me!