ఐడీ కార్డులు లేకుండా గర్భా పండాల్లోకి అనుమ‌తించ‌బోం: ఉషా ఠాకూర్ వివాదాస్ప‌ద నిర్ణ‌యం

By team teluguFirst Published Sep 9, 2022, 12:09 PM IST
Highlights

సరైన గుర్తింపు కార్డులు లేకుండా గర్భా పండాల్లోకి ఎవరినీ అనుమతించబోమని మ‌ధ్య‌ప్ర‌దేశ్ మంత్రి ఉషా ఠాకూర్ అన్నారు. గర్భా వేడుకలు లవ్ జిహాద్ కు అడ్డగా మారాయని తెలిపారు. 

ప్రామాణిక గుర్తింపు లేకుండా న‌వ‌రాత్రుల్లో గ‌ర్భా పండాల్లోకి అనుమ‌తించ‌బోమ‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్ర సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ అన్నారు. ‘లవ్ జిహాద్’ లో మునిగి తేలేందుకు వ్యక్తులు తమ గుర్తింపులను దాచిపెట్టి గార్బా వేదికలపైకి రాకుండా నిరోధించేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు చెప్పి వివాదంలో కూరుకుపోయారు.

10 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇప్పుడే గుర్తించారా? : నితీష్ కుమార్ పై ప్ర‌శాంత్ కిషోర్ విమ‌ర్శ‌లు

“ గర్బా పండల్‌ల వద్దకు వచ్చే వారు ప్రామాణికమైన గుర్తింపు కార్డులు కలిగి ఉండాలి. సరైన ID ప్రూఫ్‌లు లేకుండా లోప‌ల‌కు అనుమతించబడదు” అని ఆమె అన్నారు. గురువారం ఆమె గ్వాలియర్‌లో మీడియాతో మాట్లాడారు. “ గర్బాస్ గతంలో లవ్ జిహాద్ కార్యకలాపాలకు పెద్ద అడ్ద‌గా మారింది. కానీ ఇప్పుడు సంబంధిత నిర్వాహ‌కులు అంద‌రూ ఈ విష‌యంలో అప్రమత్తంగా ఉన్నారు. నిజమైన గుర్తింపును దాచిపెట్టి ఎవరూ వేదికలపైకి రాకుండా చూసేందుకు ప్ర‌తీ ఒక్క‌రి గుర్తింపు కార్డులు చెక్ చేస్తారు.” అని మంత్రి అన్నారు. ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఈవెంట్ నిర్వాహకులను కోరారు. ‘‘ఇది సలహా అలాగే సూచన కూడా ’’ అని ఆమె చెప్పారు.

రాజస్థాన్ లో బాల్యవివాహం.. ఏడాది వయసు బాలికకుపెళ్లి.. 20 యేళ్ల తరువాత రద్దు చేసిన కోర్టు..

మంత్రి ఉషా ఠాకూర్ ఇలాంటి వివాదంలోకి దిగడం ఇదే మొదటిసారి కాదు. ఆమె 2013లో ఇండోర్ జిల్లాలోని ఇండోర్-III స్థానం నుండి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ స‌మ‌యంలో నవరాత్రి ఉత్సవాల‌కు ముందు, గార్బా వేదికలపైకి హిందువులు కానివారు, ముఖ్యంగా ముస్లింలు ప్రవేశించడాన్ని నిషేధించాలని డిమాండ్ ఆమె చేశారు. హిందూ బాలికలను,స్త్రీలను ముస్లిం పురుషులు ప్ర‌లోభానికి గురి చేయ‌కుండా నిరోధించే ప్రయత్నమని ఆమె పేర్కొన్నారు. 

అలాగే 2017లో సంవ‌త్స‌రంలో భోపాల్ ప్రాంతంలో హిందూ ఉత్సవ స‌మితి ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టే పండుగ వేదికలపైకి హిందువులు కానివారిని నిరోధించడానికి గుర్తింపు రుజువుగా ఆధార్ కార్డులను కలిగి ఉండాలని జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ను ఆమె కోరింది. హిందువులుగా నటిస్తూ వేదికల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించే వారి ఆధార్, ఇతర ID ప్రూఫ్‌లను తప్పనిసరి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 

విదేశీ చదువులకు యువ‌త‌ మొగ్గు.. రికార్డు స్థాయిలో భార‌తీయ విద్యార్థుల‌కు అమెరికా వీసాలు

కాగా.. ఠాకూర్ సూచనలపై రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి నరేంద్ర సలుజా స్పందించారు. గార్బా ఈవెంట్‌లలో గుర్తింపును దాచిపెట్టే వ్యక్తుల ప్రవేశాన్ని నిరోధించే చర్యలు ఆమోదయోగ్యమైనవని అన్నారు. కానీ గర్భా వేదికలను లవ్ జిహాద్ కేంద్రాలుగా పేర్కొనడం శోచనీయమని అన్నారు.

భారతదేశంలోని అనేక ప్రాంతాలలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ గర్బా వేడకులను నిర్వహిస్తారు. అయితే వీటిని మధ్యప్రదేశ్ అంతటా ఘనంగా చేపడుతారు. అయితే ఇండోర్, చుట్టుపక్కల జిల్లాలతో సహా మాల్వా-నిమార్ ప్రాంతంలో ఇవి అత్యంత ప్రాచుర్యం పొందాయి.
 

click me!