రాహుల్ గాంధీకి బాంబ్ బెదిరింపులు చేసిన 60 ఏళ్ల నిందితుడు అరెస్టు

By Mahesh KFirst Published Apr 28, 2023, 6:04 AM IST
Highlights

రాహుల్ గాంధీకి బెదిరింపు లేఖ రాసిన 60 ఏళ్ల నిందితుడిని మధ్యప్రదేశ్ పోలీసులు పట్టుకున్నారు. గతేడాది నవంబ్‌లో భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశిస్తున్న సందర్భంలో ఆయన ఈ బెదిరింపులు చేశారు.
 

భోపాల్: భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లోకి ఎంట్రీ కాబోతున్న సందర్భంలో రాహుల్ గాంధీకి ఓ బెదిరింపులు వచ్చాయి. ఆయన ఇండోర్‌లోకి ప్రవేశించిన వెంటనే ఆయనపై బాంబ్ వేస్తానని బెదిరిస్తూ రాసిన లేఖ అదే నగరంలోని ఓ స్వీట్ షాప్ ఎదురుగా లభించింది. ఈ ఘటనపై పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా ఆ లేఖ రాసి రాహుల్ గాంధీని బెదిరించిన 60 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

60 ఏళ్ల దయాసింగ్ అలియాస్ ఐశిలాల్ ఝామ్‌ను దేశ భద్రతా చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. ఆయన మరికాసేపట్లో ట్రైన్ ఎక్కి పారిపోతున్నాడనే సమాచారం రాగానే ఆయనను పట్టుకున్నారు. 

Latest Videos

Also Read: ఈజిప్టులో పురాతన బుద్ధ విగ్రహం లభ్యం.. రోమన్ సామ్రాజ్యంతో ప్రాచీన భారతానికి మధ్య వాణిజ్య సంబంధాలు!

దేశ భద్రతా చట్టం కింద ఐశిలాల్ ఝామ్‌ను జైలుకు పంపించాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసినట్టు క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు నిమిష్ అగ్రవాల్ తెలిపారు. రాహుల్ గాంధీకి ఈ బెదిరింపుల లేఖ నిందితుడు ఐశిలాల్ ఝామ్ ఎందుకు పంపించాడనే విషయంపై స్పష్టత లేదని వివరించారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.

గతేడాది నవంబర్‌లో ఈ లేఖ బయటపడగానే పోలీసులు ఐపీసీలోని 507 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మధ్య ప్రదేశ్ పోలీసులు అప్పుడే దర్యాప్తు ప్రారంభించారు.

click me!