భార్య బర్త్‌డేకు కేక్ కొనివ్వడానికి ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్‌కు కోర్టు అనుమతి

Published : Apr 28, 2023, 03:52 AM IST
భార్య బర్త్‌డేకు కేక్ కొనివ్వడానికి ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్‌కు కోర్టు అనుమతి

సారాంశం

భార్యకు బర్త్‌డే రోజు కేక్ కొనివ్వడానికి ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్‌కు అదనపు సెషన్స్ న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. మండోలి జైలులోని బేకరీలో ఆయన కేక్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దాన్ని 20.04.2023నాడు అందించాలి.  

న్యూఢిల్లీ: భార్య లీనా పాలోజ్‌ బర్త్‌డేకు కేక్ కొనివ్వడానికి అనుమతించాలన్న ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్‌ అభ్యర్థనకు పటియాలా హౌజ్ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ కేక్ లేదా పాస్త్రీని మండోలి జైలులోని బేకరీ నుంచే సుకేశ్ చంద్రశేఖర్ కొనుగోలు చేస్తాడు. అందుకు జైలులో సంపాదించిన డబ్బులనే ఆయన ఖర్చు పెట్టనున్నడు. ఆర్థిక మోసం కేసులో సుకేశ్ చంద్రశేఖర్, ఆయన భార్య లీనా పాలోజ్‌లు ఇద్దరూ జైలులోనే(విచారణ ఖైదీలు) ఉన్నారు. ఈ కేకును లీనా పాలోజ్ బర్త్ డే రోజున అంటే 2023 ఏప్రిల్ 28వ తేదీన ఇవ్వాల్సి ఉంటుంది.

సుకేశ్ చంద్రశేఖర్ అభ్యర్థనలో మానవ ఉద్వేగాలు మినహా న్యాయపరమైన కోణాలేవీ కనిపించలేవని, అందుకే ఆయన సబ్మిషన్‌ను కన్సిడర్ చేస్తున్నట్టు అదనపు సెన్స్ న్యాయమూర్తి శైలేందర్ మాలిక్ ఏప్రిల్ 25వ తేదీన ఈ తీర్పు వెలువరించారు.

తమ కుటుంబం, బంధువులతో  ఆత్మీయ సంబంధాలను కొనసాగిస్తున్న ధైర్యం విచారణ ఖైదీలకు అవసరం. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు జడ్జీ తెలిపారు. అది కూడా సుకేశ్ చంద్రశేఖర్ మండోలి జైలులోనే కేక్ లేదా పాస్త్రీని కొంటాడని, అదీ ప్రిజన్ ఫండ్ నుంచే కొనుగోలు చేస్తాడని వివరించారు. కాబట్టి, బయటి నుంచి ఒక వస్తువు తీసుకువచ్చి విచారణ ఖైదీకి ఇస్తున్నట్టుగా భావించాల్సిన పని లేదని తెలిపారు. 

Also Read: రైడ్ చేస్తుండగా దుండగుల ఫైరింగ్.. ఏడుగురు పోలీసులకు గాయాలు

కాబట్టి, సుకేశ్ చంద్రశేఖర్ జైలులోని బేకరీ నుంచి కేక్ కొనుగోలు చేయడానికి సూపరింటెండెంట్ అనుమతి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఆ కేక్‌ను విచారణ ఖైదీ లీనా పాలోజ్‌కు 28.04.2023 నాడు అందించాలని తెలిపింది.

200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్ జైలుకు వెళ్లాడు. మోసం చేయడంలో ఆయన భార్య లీనా పాలోజ్ కూడా సహకరించిన ఆరోపణలతో ఆమె కూడా విచారణ ఖైదీగా ఉన్నారు. వీరి కేసు విచారణ సమయంలో బాలీవుడ్ నటీమణులు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహీల పేర్లు బయటకు వచ్చాయి.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu