మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత

Published : Jul 21, 2020, 07:47 AM IST
మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత

సారాంశం

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. శ్వాసకోశ సంబంధమైన వ్యాధులతో ఆయన కొద్ది కాలం క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో గల ఆస్పత్రిలో చేరారు.

భోపాల్: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 85. కొద్ది రోజుల క్రితం శ్వాసకోశ సంబంధమైన వ్యాధులతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో గల ఓ ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. 

శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఎదురుకావడంతో, జ్వరం కూడా ఉండడంతో ఆయనను కొద్ది రోజుల క్రితం లక్నోలోని ఆస్పత్రిలో చేర్చారు లాల్జీ టాండన్ ను క్రిటికల్ కేర్ వెంటిలేటర్ సపోర్టుపై పెట్టారు. 

లాల్జీ టాండన్ మృతితో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ కు అదనంగా మధ్యప్రదేశ్ గవర్నర్ బాధ్యతలు అప్పగించారు. 

 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?