అమెరికా స్కూల్ టాపర్: యూపీ మెకానిక్ కొడుకు షాదాబ్

By narsimha lodeFirst Published Jul 20, 2020, 6:22 PM IST
Highlights

మెకానిక్ కొడుకు అమెరికా ప్రభుత్వం ఇచ్చే కెన్నడి లూగర్ యూత్ ఎక్చేంజ్ స్కాలర్ షిప్ కు ఎంపికయ్యాడు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన షాదాబ్.


లక్నో: మెకానిక్ కొడుకు అమెరికా ప్రభుత్వం ఇచ్చే కెన్నడి లూగర్ యూత్ ఎక్చేంజ్ స్కాలర్ షిప్ కు ఎంపికయ్యాడు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన షాదాబ్.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్  కు చెందిన మోటార్ మెకానిక్ కొడుకు మహ్మద్ షాదాబ్ చిన్నప్పటి నుండి చదువులో టాపర్.అమెరికన్‌ స్కాలర్‌షిప్‌ పొంది హై స్కూల్‌ విద్య కోసం ఆ దేశం వెల్లడమే కాక తన ప్రతిభతో అక్కడ కూడా టాపర్‌గా నిలిచాడు షాదాబ్.

దీని ద్వారా షాదాబ్ కు రూ. 20 లక్షలు వచ్చాయి. దీంతో హైస్కూల్ చదువుల నిమిత్తం షాదాబ్ అమెరికా వెళ్లాడు.ఈ క్రమంలో ఈ ఏడాది అక్కడి హైస్కూల్ లో టాపర్ గా నిలిచాడు. అంతేకాక దాదాపు 800 మంది చదువుతున్న ఈ అమెరికన్ హైస్కూల్ లో గత నెల షాదాబ్ స్టూడెంట్ ఆఫ్ ది మంత్ గా ఎంపికయ్యాడు. 

అమెరికా స్కాలర్‌షిప్‌తో చదువుకోవడానికి తాను ఇక్కడికి వచ్చినట్టుగా ఆయన చెప్పారు. తాను టాపర్ గా నిలవడం తనకు గర్వంగా ఉందన్నారు. తన కుటుంబానికి తాను మద్దతుగా నిలవాలనుకొంటున్నాను.. వారిని గర్వపడేలా చేస్తానని చెప్పాడు.

షాదాబ్ తండ్రి 25 ఏళ్లుగా మోటార్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన ఆయన తన కొడుకు గురించి చాలా గర్వపడుతున్నట్టుగా చెప్పారు. తన కొడుకు కలెక్టర్ గా అయి దేశానికి సేవ చేయాలని ఆశిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

click me!