Madhya Pradesh Exit polls 2023 : బీజేపీ - కాంగ్రెస్ మధ్య హోరాహోరీ.. విజయం ఎవరిదో చెప్పని ఎగ్జిట్ పోల్స్

Siva Kodati |  
Published : Nov 30, 2023, 08:22 PM ISTUpdated : Nov 30, 2023, 08:25 PM IST
Madhya Pradesh Exit polls 2023 : బీజేపీ - కాంగ్రెస్ మధ్య హోరాహోరీ.. విజయం ఎవరిదో చెప్పని ఎగ్జిట్ పోల్స్

సారాంశం

మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 116 స్థానాల్లో గెలవాల్సి వుంటుంది. తాజాగా జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఎవరికి విజయం దక్కుతుందన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ జరుగుతుందని అన్ని సర్వేలు తెలిపాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కీలకమైన మధ్యప్రదేశ్‌‌పై ఈసారి అందరి చూపు పడింది. నిజానికి 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు బీజేపీకి 109 స్థానాలు రాగా.. కాంగ్రెస్‌కు 114 స్థానాలు దక్కి కమల్‌నాథ్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడింది. అయితే పదవుల పంపకం, ఇతర కారణాలతో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోగా.. అనూహ్య పరిణామాల మధ్య శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 

ALso Read: Telangana Exit polls 2023: తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా

మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 116 స్థానాల్లో గెలవాల్సి వుంటుంది. తాజాగా జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఎవరికి విజయం దక్కుతుందన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ జరుగుతుందని అన్ని సర్వేలు తెలిపాయి. కొన్నింటిలో కాంగ్రెస్, మరికొన్నింటిలో బీజేపీకే అధికారమని తేలింది. నవంబర్ 17న ఒకే దశలో ఇక్కడ ఎన్నికలు జరిగాయి. 

మధ్యప్రదేశ్‌లో పలు సంస్థల సర్వేల అంచనాలు ఇలా :

పీపుల్స్ పల్స్ :  బీజేపీ 91 - 113, కాంగ్రెస్ 117 - 139, ఇతరులు 0 - 8
దైనిక్ భాస్కర్ :  బీజేపీ 95 - 115, కాంగ్రెస్ 105 - 120
జన్‌కీ బాత్ :  బీజేపీ 100 - 123, కాంగ్రెస్ 102 - 125, ఇతరులు 0 - 5
మేట్రిజ్ :  బీజేపీ 118 - 130, కాంగ్రెస్ 97 - 107, ఇతరులు 0 - 2
రిపబ్లిక్ టీవీ :  బీజేపీ 118 - 130, కాంగ్రెస్ 97 - 107, ఇతరులు 0 - 2
పోల్‌స్ట్రాట్ :  బీజేపీ 106 - 116, కాంగ్రెస్ 111 - 121
న్యూస్ 18 :  బీజేపీ 112 , కాంగ్రెస్ 113, ఇతరులు 5
సీఎన్ఎన్ :  బీజేపీ 116, కాంగ్రెస్ 111, ఇతరులు 3
న్యూస్24 - టుడేస్ చాణక్య :  బీజేపీ 151, కాంగ్రెస్ 74
ఇండియా టుడే :  బీజేపీ 106 - 116, కాంగ్రెస్ 111 - 121 , ఇతరులు 0 - 6
జీ న్యూస్ :  బీజేపీ 118 - 130, కాంగ్రెస్ 97 - 107, ఇతరులు 0 - 2

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?