Rajasthan Exit Poll 2023 : సెంటిమెంట్ రిపీట్ .. బీజేపీదే అధికారం, రాజస్థాన్‌లో అన్ని సర్వేలదీ ఒకటే మాట

By Siva KodatiFirst Published Nov 30, 2023, 7:32 PM IST
Highlights

వివిధ జాతీయ మీడియా సంస్థలు, ఏజెన్సీలు నిర్వహించిన సర్వేల్లో రాజస్థాన్‌లో బీజేపీదే అధికారమని తేలింది. కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగిన స్థాయిలో పోటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. తొలి నుంచి ఇక్కడి ఓటర్లు అధికారంలో వున్న పార్టీని ఓడిస్తూ వస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. బీజేపీ సైతం విజయం తమదేనని తేల్చిచెబుతోంది. రాష్ట్రంలోని 199 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 25 పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనర్ మృతి చెందడంతో కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోలింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Also Read: Telangana Exit polls 2023: తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా

Latest Videos

రాజస్థాన్‌లో శాంతియుతంగా ఓటింగ్‌ జరిగేందుకు 1,02,290 మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. 69,114 మంది పోలీసు సిబ్బంది.. 32,876 మంది రాజస్థాన్ హోంగార్డ్, ఫారెస్ట్ గార్డ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని మోహరించారు. అలాగే 700 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలను దించారు. 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 73 సీట్లు గెలుచుకుంది. బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో అశోక్ గెహ్లాట్ సీఎం పీఠాన్ని అధిష్టించారు.

వివిధ జాతీయ మీడియా సంస్థలు, ఏజెన్సీలు నిర్వహించిన సర్వేల్లో రాజస్థాన్‌లో బీజేపీదే అధికారమని తేలింది. కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగిన స్థాయిలో పోటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

రాజస్థాన్‌లో పలు సంస్థల సర్వేల అంచనాలు ఇలా :

దైనిక్ భాస్కర్ : బీజేపీ 98 - 105, కాంగ్రెస్ 85 - 95
పి-మార్క్య్  : బీజేపీ 105 - 125, కాంగ్రెస్ 69 - 91
టైమ్స్‌నౌ ఈటీజీ : బీజేపీ 100 - 128, కాంగ్రెస్ 56 - 72
టీవీ 9 భారత్ వర్ష్ : పోల్‌స్ట్రాట్ : బీజేపీ 100 - 110, కాంగ్రెస్ 90 - 100
జన్‌కీ బాత్ : బీజేపీ 100 - 122, కాంగ్రెస్ 62 - 85, ఇతరులు 14 - 15
రిపబ్లిక్ టీవీ : బీజేపీ 118 - 130, కాంగ్రెస్ 97 - 107, ఇతరులు 2
న్యూస్ 18 : బీజేపీ 111, కాంగ్రెస్ 74, ఇతరులు 14
న్యూస్ నేషన్ : బీజేపీ 89 - 93, కాంగ్రెస్ 99 - 103, ఇతరులు 5 - 9 
ఇండియా టుడే : బీజేపీ 55 - 72, కాంగ్రెస్ 119 - 141, ఇతరులు 4 - 11
పీపుల్స్ పల్స్ సర్వే : బీజేపీ 95 - 115, కాంగ్రెస్ 73 - 95, ఇతరులు 8 - 11
ఏబీపీ సీఓటర్ : బీజేపీ 94 - 114, కాంగ్రెస్ 71 - 91,
 

click me!