Love Affair: యువతిని, ఆమె తండ్రిని తుపాకీతో కాల్చి.. ట్రైన్ ముందు దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య

Published : May 22, 2023, 02:08 PM IST
Love Affair: యువతిని, ఆమె తండ్రిని తుపాకీతో కాల్చి.. ట్రైన్ ముందు దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య

సారాంశం

మధ్యప్రదేశ్‌లో ఓ యువతి, ఆమె తండ్రిని కానిస్టేబుల్ తుపాకీతో కాల్చేశాడు. ప్రేమ వ్యవహారం కారణంగా ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తున్నది. వారిద్దరిని కాల్చిన తర్వాత ఆ కానిస్టేబుల్ ఓ ట్రైన్ ముందు దూకేసి ఆత్మహత్య చేసుకున్నాడు.  

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఓ దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారం కారణంగా ఇద్దరు ప్రాణాలు పోయాయి. ఒకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. స్వయంగా ఓ మధ్యప్రదేశ్ కానిస్టేబుల్.. యువతిని, ఆమె తండ్రిని తుపాకీతో కాల్చాడు. ఆ తర్వాత ఓ ట్రైన్ ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బెర్చా పోలీసు స్టేషన్ పరిధిలోని మాలిఖేడి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఓ వ్యక్తి యువతిని, ఆమె తండ్రిని ఇద్దరిని ఓ ప్రేమ వ్యవహారంలో తుపాకీతో కాల్చేశాడని పోలీసులకు ఆ రోజు రాత్రి సమాచారం వచ్చింది. ఆ సమాచారం తెలియగానే పోలీసులు యాక్షన్‌లోకి దిగారు. స్పాట్‌కు వెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ మహిళ గాయాలతో కొట్టుమిట్టాడుతున్నది. ఆమె తండ్రి మాత్రం ఘటనలో మరణించినట్టు సబ్ డివిజనల్ ఆఫ్ పోలీసు భవిష్య భాస్కర్ ఏఎన్ఐకి వివరించారు.

Also Read: నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ముర్ముకు ఆహ్వానం లేదు: కేంద్రంపై ఖర్గే విమర్శలు

అదే కేసులో ఉదయం అదే ఏరియాలో రైల్వే ట్రాక్ సమీపంలో ఓ డెడ్ బాడీ కనిపించింది. పోలీసులు స్పాట్‌కు వెళ్లి దర్యాప్తు చేశారు. 

వారిద్దరిని తుపాకీతో కాల్చిన తర్వాత కానిస్టేబుల్ ట్రైన్ ముందు దూకేసి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆ కానిస్టేబుల్‌ను సుభాష్ ఖరాడిగా గుర్తించారు. దేవాస్ పోలీసు లైన్స్‌లో ఆయన విధుల్లో ఉండేవారు.

PREV
click me!

Recommended Stories

ఇక ఓటర్లు BLOల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.. SIRపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
పై నుంచి చూస్తే ఇడ్లీ, రాగి పిండి క‌వ‌ర్లు.. ఓపెన్ చేసి చూడ‌గా అధికారుల‌ ఫ్యూజులు అవుట్