అది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను సవాల్ చేస్తూ .. రివ్యూ పిటిషన్ దాఖలు  

By Rajesh KarampooriFirst Published Nov 23, 2022, 5:38 PM IST
Highlights

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగంలోని 103వ సవరణ రాజ్యాంగ చెల్లుబాటును సమర్థిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 103వ రాజ్యాంగ సవరణపై కాంగ్రెస్‌ నేత జయ ఠాకూర్‌ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఆర్థికంగా బలహీన వర్గాల వారి (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ ను వ్యతిరేకిస్తూ.. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత డాక్టర్ జయ ఠాకూర్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. ఇందులో ఈడబ్ల్యూఎస్ సమస్యలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్థికంగా బలహీన వర్గాలకు ఇవ్వాల్సిన ఈడబ్ల్యూఎస్ కోటాపై సోమవారం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 3:2 మెజారిటీతో ..రాజ్యాంగంలోని 103వ సవరణ చట్ట చెల్లుబాటును సమర్థించింది.

ఈ సవరణ చట్టం ద్వారా విద్యా సంస్థలు , ప్రభుత్వ ఉద్యోగాలలో 10% EWS రిజర్వేషన్లను కల్పించబడుతుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ ను  జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేల ఎం త్రివేది, జస్టిస్ జేబీ పార్దివాలా లు  అంగీకరించారు. ఈ రిజర్వేషన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించదని ముగ్గురు న్యాయమూర్తులు భావిస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఉల్లంఘించదని ముగ్గురు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో సీజేఐ జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్ లు  భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

తాజాగా ఈ నిర్ణయంపై రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత డాక్టర్ జయ ఠాకూర్ 103వ సవరణ EWS రిజర్వేషన్ యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశారు. రివ్యూ పిటిషన్‌లో  .. "భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని మార్చే 103వ రాజ్యాంగ సవరణ తీవ్ర వైరుధ్యం. గతంలో ఇంద్ర సాహ్నీ & ఓర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు వెలువరిచిన తీర్పుకు విరుద్ధం." అని పేర్కోన్నారు.

ఆర్థిక ప్రమాణాల ప్రాతిపదికన బహిరంగ పోటీలో అందుబాటులో ఉన్న ఖాళీలు, పోస్టులలో 10% రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యంగ విరుద్దమని రివ్యూ పిటిషన్‌లో పేర్కొంది. అలాగే.. అన్ ఎయిడెడ్ సంస్థలలో రిజర్వేషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(జి)ప్రకారం ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేవలం అగ్రవర్ణాల EWSకి 10% రిజర్వేషన్ కల్పించడం వివక్షకు సమానమైన సమానత్వ కోడ్‌ను ఉల్లంఘించడమేనని కాంగ్రెస్ నేత తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

కాంగ్రెస్ నిరసన 

EWS రిజర్వేషన్ రాజ్యాంగ చెల్లుబాటును సుప్రీం కోర్టు సమర్థించాడని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ తీర్పు తర్వాత కాంగ్రెస్ నాయకుడు ఉదిత్ రాజ్ మాట్లాడుతూ.. తాను EWS రిజర్వేషన్‌ను వ్యతిరేకించడం లేదని, సుప్రీం కోర్టు అగ్రవర్ణ అనుకూల మనస్తత్వాన్ని వ్యతిరేకిస్తున్నానని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల విషయానికి వస్తే.. ఇందిరా సాహ్ని కేసును ఉదహరిస్తూ ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఉదహరించారు. నేడు రాజ్యాంగాన్ని ఉటంకిస్తూ రిజర్వేషన్లకు పరిమితి లేదు అని చెబుతున్నారని విమర్శించారు.

click me!