మధ్యప్రదేశ్‌లో విషాదం: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు, ముగ్గురు మృతి

Published : Feb 06, 2024, 01:33 PM ISTUpdated : Feb 06, 2024, 02:15 PM IST
మధ్యప్రదేశ్‌లో  విషాదం: బాణసంచా ఫ్యాక్టరీలో  పేలుడు, ముగ్గురు మృతి

సారాంశం

ప్రమాదాలు జరిగిన సమయంలోనే  అధికారులు హడావుడి చేస్తున్నారు.దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తరచుగా  ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.  ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. 

న్యూఢిల్లీ:  మధ్యప్రదేశ్‌లోని హర్దా పట్టణంలోని బాణసంచా ఫ్యాక్టరీలో  మంగళవారంనాడు పేలుడు చోటు చేసుకుంది.  ఈ ఘటనలో  ముగ్గురు మృతి చెందారు.  మరో 40 మంది గాయపడ్డారు. పేలుడుతో  బాణసంచా ఫ్యాక్టరీ ప్రాంగణానికి గణనీయమైన నష్టం వాటిల్లింది.

 

 అగ్నిమాపక శాఖ వాహనాలు మంటలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగాయి. ఈ పేలుడు ధాటికి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో  చుట్టుపక్కల భవనాలకు కూడ మంటలు వ్యాపించాయి. 

also read:ఓటమి తర్వాత తొలిసారిగా తెలంగాణ భవన్ కు కేసీఆర్: కృష్ణా పరివాహక ప్రాంత నేతలతో భేటీ

ఈ విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలాన్ని సందర్శించాలని  మంత్రి ఉదయ్ ప్రతాప్ సింగ్, ఐపీఎస్ అధికారి అజిత్ కేసరి, డీజీపీ హొంగార్డు అరవింద్ కుమార్ లను సీఎం మోహన్ యాదవ్ ఆదేశించారు.భోపాల్, ఇండోర్ వైద్య కాలేజీలు, ఎయిమ్స్ బోపాల్ లోని  ఆసుపత్రుల్లో  క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఇండోర్, భోపాల్ నుండి అగ్నిమాపక దళాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.  సహాయక చర్యలను సమన్వయం చేయడానికి  సహాయం అందించాలని సీనియర్ అధికారులను  సీఎం ఆదేశించారు.

 

ఈ విషయమై మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతాపం వ్యక్తం చేశారు.  క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు.



 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్