నిజజీవిత కథనాలతో సినిమా తెరకెక్కించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదీ దేశగౌరవానికి సంబంధించిన సినిమా అయితే ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇబ్బందుల్లో పడతారు. అలాంటి ఇబ్బందే ఇప్పుడు ‘ఫైటర్’ సినిమా ఎదుర్కొంటోంది.
న్యూఢిల్లీ : సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో దీపికా పదుకొనే, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన 'ఫైటర్' సినిమా న్యాయపరమైన చిక్కుల్లో పడింది. ఈ సినిమాలో కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. వీటిమీద సినిమా టీంకు లీగల్ నోటీసు అందింది. హీరో హీరోయిన్ల మధ్య ముద్దు సీన్.. సినిమా క్లైమాక్స్‌లో ఉంటుంది. చివరికి సినిమా అంతా మంచి ముగింపుకు వచ్చిన తరువాత ఈ సీన్ ఉంటుంది.
దీపిక పదుకొనే (స్క్వాడ్రన్ లీడర్ మినీ రాథోర్‌గా నటించారు), హృతిక్ (స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియాగా) వివిధ వ్యక్తిగత, వృత్తిపరమైన సవాళ్లను అధిగమించి చివరికి లిప్ లాక్‌తో ఒకరితో మరొకరు మళ్లీ కలుస్తారు.
కుక్కబిస్కెట్లు తిననన్నాను.. రాజీనామా చేశాను... రాహుల్ గాంధీ వైరల్ వీడియోపై అస్సాం సీఎం హిమంత శర్మ
అయితే, ఈ సీన్ చేసే సమయంలో వారిద్దరూ ఎయిర్ ఫోర్స్ యూనిఫాంలో ఉంటారు. భారతీయ వైమానిక దళ అధికారికి నచ్చలేదు. ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిమీద చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపించారు.
సమాచారం ప్రకారం.. ప్రముఖ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టీమ్‌లో భాగమైన ఇద్దరు ప్రధాన పాత్రల మధ్య లిప్ లాక్ కారణంగా సైన్యం పరాక్రమం, దాని యూనిఫాం అవమానించబడ్డాయని వారు భావించారని తెలుస్తోంది.