గ్యాస్ సిలిండర్ పై నెలకు రూ.300 సబ్సిడీ... ఎక్కడో తెలుసా...

Published : Mar 14, 2023, 12:20 PM IST
గ్యాస్ సిలిండర్ పై నెలకు రూ.300 సబ్సిడీ... ఎక్కడో తెలుసా...

సారాంశం

పుదుచ్చేరీ ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. గ్యాస్ సిలిండర్ల మీద రూ.300 నెలవారీ సబ్సిడీని ప్రకటించింది. 

పుదుచ్చేరి : దేశవ్యాప్తంగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు సామాన్యుడి నెత్తిన పిడుగుపాటుగా మారాయి. పెరుగుతున్న నిత్యావసర ధరలు,  ఇంధన ధరలతోపాటు.. గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధర రూ.1200కు చేరుకుని సామాన్యుడికి షాక్ ఇచ్చింది. సామాన్యుడికి కాస్త ఉపశమనం కలిగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలనుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకతలు వెల్ల్లువెత్తకుండా  చూసుకుంటున్నాయి. ఏదేమైతేనేం అంతిమంగా ప్రజలకు మంచి జరగడమే కావాల్సింది. అలాంటి చర్యల్లో భాగంగానే పుదుచ్చేరి ప్రభుత్వం  తమ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది.

రాష్ట్రంలోని బిపిఎల్ వర్గాల ప్రజలకు పుదుచ్చేరి ప్రభుత్వం రూ. 300  నెలవారి ఎల్పిజి సబ్సిడీని ప్రకటించింది. 2023-24 సంవత్సరానికి గాను సమర్పించిన బడ్జెట్లో ముఖ్యమంత్రి ఏం రంగసామి ఈ మేరకు ప్రకటించి సామాన్యుడికి ఉపశమనాన్ని కలిగించారు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ…నెలకో సిలిండర్ కు 300 రూపాయల చొప్పున ప్రభుత్వ సబ్సిడీని అందించే పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి ప్రభుత్వం రూ.126కోట్లు  కేటాయించింది. అని తెలిపారు. ఈ మేరకు11,600  కోట్ల  పన్నురహిత బడ్జెట్ను ముఖ్యమంత్రి సమర్పించారు. 

గుజరాత్ లో భారీ అగ్నిప్రమాదం.. వల్సాద్‌లోని 10 స్క్రాప్ గోడౌన్లలో చెలరేగిన మంటలు..

రేషన్ కార్డులున్న ప్రతి కుటుంబానికి ఎల్పిజి సిలిండర్ సబ్సిడీ  అందుతుందని తెలిపారు. సిలిండర్ ధరలు భారీగా పెరగడం ఈ ఏడాదిలో అప్పుడే ఇది రెండోసారి. జనవరి 1న సిలిండర్ ధరను పెంచారు. ఇటీవల మార్చి 1వ తేదీన మరోసారి భారీగా పెంచారు. ఈ మేరకు చమరు సంస్థలు తీసుకున్న నిర్ణయం సామాన్యుల పాలిట పెను శాపంగా మారింది. పెరిగిన ధరలకు తోడు స్థానిక పనుల కారణంగా ఎల్పిజి సిలిండర్ ధరలు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. చమరు సంస్థలు ఒకటవ తేదీన ఎల్పిజి సిలిండర్ ధరలను సవరిస్తుంటాయి. ఏడాదికి 12 సిలిండర్ల చొప్పున  దేశంలోని ప్రతి ఇంటికి  సబ్సిడీ రేట్లతో అందుతాయి. ఒకవేళ 12 కు మించిన సిలిండర్లు కావాలంటే మార్కెట్లో ఉన్న రేటుకు కొనుక్కోవాల్సి ఉంటుంది. 

PREV
click me!

Recommended Stories

UPI Update : ఫోన్ పే, గూగుల్ పే నుండి తెలియని నంబర్లకు డబ్బులు పంపితే .. ఏం చేయాలో తెలుసా?
Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?