గుజరాత్ లో భారీ అగ్నిప్రమాదం.. వల్సాద్‌లోని 10 స్క్రాప్ గోడౌన్లలో చెలరేగిన మంటలు..

Published : Mar 14, 2023, 12:18 PM ISTUpdated : Mar 14, 2023, 12:20 PM IST
గుజరాత్ లో భారీ అగ్నిప్రమాదం.. వల్సాద్‌లోని 10 స్క్రాప్ గోడౌన్లలో చెలరేగిన మంటలు..

సారాంశం

గుజరాత్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వల్సాద్‌ ప్రాంతంలో ఉన్న సుమారు 10 గోడౌన్లలో మంగళవారం ఉదయం భీకర మంటలు చెలరేగాయి. దీని వల్ల ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదు. 

గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వల్సాద్‌లోని సుమారు 10 గోడౌన్లలో మంగళవారం ఉదయం భీకర మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. నేటి తెల్లవారుజామున వల్సాద్ జిల్లాలోని వాపి ప్రాంతంలోని స్క్రాప్ గోడౌన్లలో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను చల్లార్చారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు.

రైల్వే స్టేషన్‌లో డ్రమ్ములో మహిళ మృతదేహం.. మచిలీపట్నంనుంచి తీసుకొచ్చి..

కాగా.. తమిళనాడులోని మధురైలో ఉన్న విడిభాగాల గోడౌన్‌లో సోమవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది చాలా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.

ముంబైలోని జోగేశ్వరి ప్రాంతంలోని రామమందిరం సమీపంలో ఉదయం 11 గంటలకు మంటలు చెలరేగాయి. ఓషివారా ఫర్నీచర్ మార్కెట్ సమీపంలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే 10 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు ప్రయాత్నాలు మొదలు పెట్టాయి. అయితే ఈ మంటల వల్ల ఎవరికీ గాయాలు కాలేదని బీఎంసీ పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

UPI Update : ఫోన్ పే, గూగుల్ పే నుండి తెలియని నంబర్లకు డబ్బులు పంపితే .. ఏం చేయాలో తెలుసా?
Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?