రైల్వే స్టేషన్‌లో డ్రమ్ములో మహిళ మృతదేహం.. మచిలీపట్నంనుంచి తీసుకొచ్చి..

Published : Mar 14, 2023, 11:32 AM IST
రైల్వే స్టేషన్‌లో డ్రమ్ములో మహిళ మృతదేహం.. మచిలీపట్నంనుంచి తీసుకొచ్చి..

సారాంశం

బెంగళూరు రైల్వే స్టేషన్‌లో డ్రమ్ములో మహిళ మృతదేహం దొరికింది. ఇలాంటి ఘటన  ఈ యేడాదిలో ఇది రెండోది. జనవరిలో ఇలాంటిదే మరో ఘటన జరిగింది.   

బెంగళూరు : బెంగళూరులోని రైల్వే స్టేషన్‌లో సోమవారం ఓ డ్రమ్ములో మహిళ మృతదేహం కలకలం రేపింది.  రైల్వే స్టేషన్‌ ద్వారం దగ్గర ఓ మహిళ మృతదేహం ప్లాస్టిక్ డ్రమ్ములో లభ్యమైంది. ఇలా బెంగళూరు రైల్వే స్టేషన్‌లో డ్రమ్‌లో మృతదేహం దొరకడం ఈ యేడాది ఇది రెండో ఘటన. ఇది సోమవారం నాడు వెలుగులోకి వచ్చింది.

సోమవారం ఉదయం 10 -11 గంటల మధ్య బైయప్పనహళ్లి రైల్వే స్టేషన్‌లోని ఒక ప్రవేశ ద్వారం దగ్గర ఒక డ్రమ్ము అనుమానాస్పదంగా కనిపించింది. మూత బిగించి ఉంది.. తెరిచి చూస్తే అందులో పైన బట్టలు కనిపించాయి. అనుమానంతో లోపల చెక్ చేయగా ఓ మహిళ మృతదేహం కనిపించింది. ఆమె వయసు దాదాపు 31 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని గుర్తించారు. ఆ మహిళ ఎవరనేది ఇంకా గుర్తించాల్సి ఉంది.

విషయం తెలియడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దీనిమీద కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు. రైల్వే స్టేషన్ లోని సీసీ టీవీ ఫుటేజీలో ముగ్గురు వ్యక్తులు సోమవారం ఆటోరిక్షాలో ఈ డ్రమ్మును తీసుకువచ్చి రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారం సమీపంలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని మచిలీపట్నం నుంచి రైలులో తరలించినట్లు వారి విచారణలో తేలింది. 

మచిలీపట్నానికి బృందాన్ని పంపామని, అయితే మృతదేహాన్ని గుర్తించలేకపోయామని రైల్వే పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ సౌమలత తెలిపారు. కాగా, రెండు నెలల క్రితం, జనవరి 4న యశ్వంతపూర్ రైల్వే స్టేషన్‌లో క్లీనింగ్ సిబ్బంది 20 ఏళ్లు పైబడిన మహిళ కుళ్లిపోయిన మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో గుర్తించారు.

బెంగళూరులోని యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చెత్తకుండీలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రైల్వేలోని ఒక పారిశుద్ధ్య సిబ్బంది చెత్తకుండీ నుండి దుర్వాసన వస్తుండడం గమనించి, పరిశీలించగా కుళ్ళిపోయిన మహిళ మృతదేహాం వెలుగు చూసింది. దీంతో ఆమె వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించింది.

పోలీస్ సూపరింటెండెంట్ (రైల్వే) సౌమ్యలత తెలిపిన వివరాల ప్రకారం, మహిళ మృతదేహాన్ని ఓ పాడుబడిన డ్రమ్ములో పెట్టి, దానిమీది నుంచి బట్టలు కప్పారు. డ్రమ్ము మూత టేప్ తో మూసేశారు. 
మృతదేహం 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వివాహితదిగా గుర్తించారు. రైల్వే స్టేషన్‌లోకి ఈ డ్రమ్ము ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి రైల్వే స్టేషన్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఆ మహిళ ఎవరనేది నిర్ధారించలేకపోయారు. 

పెరుగుతున్న ఆకస్మిక గుండె మరణాలకు దీర్ఘకాలిక కోవిడ్ -19తో సంబంధం ఉండొచ్చు - నిపుణులు

"ప్లాట్‌ఫారమ్‌కు తరచుగా చాలా మంది మత్స్యకారులు వస్తుంటారు. ఈ ప్లాట్‌ఫారమ్ నుంచి చాలా చేపలు, వస్తువులు ట్రాన్స్ పోర్ట్ అవుతుంటాయి. రెండు మూడు రోజులుగా పారిశుద్ధ్య సిబ్బంది ఈ డ్రమ్మును గమనిస్తున్నారు. మొదట్లో ఎవరైనా చేపల డబ్బాను ఇక్కడ ఉంచారని, తీసుకుపోవడం మర్చిపోయారని అనుకున్నారు. చేపల రవాణాకు ఉపయోగించే లాంటి డ్రమ్ములోనే మహిళ మృతదేహం లభించింది’’ అని ఎస్పీ సౌమ్యలత తెలిపారు. దీనిమీద పోలీసులు IPC సెక్షన్‌లు 302 (హత్య), 201 (నేరం సాక్ష్యం అదృశ్యం కావడం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

కాగా, గత మూడు నెలలలో ఇది మూడో కేసు అని తెలుస్తోంది. డిసెంబరు రెండవ వారంలో, ఎస్ఎంవీటీ రైల్వే స్టేషన్‌లోని ప్యాసింజర్ రైలు కోచ్‌లో పసుపురంగు గోనె సంచిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనుగొనబడింది. ఇతర సామాన్లతో పాటు ఉన్న ఈ  గోనె సంచి నుండి దుర్వాసన వస్తోందని ఒక ప్రయాణీకుడు ఫిర్యాదు చేయడంతో.. చెక్ చేయగా అందులో.. బాగా కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం అవశేషాలు కనుగొనబడ్డాయి.

జనవరి 4న యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 చివరిలో పాడుబడిన నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్‌లో కుళ్ళిపోయిన యువతి మృతదేహాన్ని రైల్వే పోలీసులు చూశారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు, అయితే ఈ మూడు సంఘటనలకు సంబంధం ఉందా? అనే అంశాన్ని చెప్పడానికి వారు నిరాకరించారు.

PREV
click me!

Recommended Stories

UPI Update : ఫోన్ పే, గూగుల్ పే నుండి తెలియని నంబర్లకు డబ్బులు పంపితే .. ఏం చేయాలో తెలుసా?
Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?