గ్రామీణ ప్రాంతాల్లో లవ్ జిహాద్, మతమార్పిడులు పెరుగుతున్నాయ్.. ఇది ఆందోళనకరం - ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

By Asianet News  |  First Published Sep 25, 2023, 2:26 PM IST

గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న ‘లవ్ జిహాద్’, మత మార్పిడులపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు అంశాలపై ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దృష్టి పెట్టాలని సూచించారు. వాటిని అరికట్టేందుకు ప్రయత్నించాలని అన్నారు.


గ్రామీణ ప్రాంతాల్లో 'లవ్ జిహాద్', మతమార్పిడులు పెరుగుతున్నాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. లక్నోలో ఆదివారం నిర్వహించిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సంస్థాగత సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు 'జాతి వ్యతిరేక', సంఘ విద్రోహ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ప్రధాని ర్యాలీకి వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టడంతో 39 మందికి గాయాలు

Latest Videos

మతమార్పిడులు, లవ్ జిహాద్ అంశాలను ప్రజల్లోకి దూకుడుగా తీసుకువెళ్లాలని కార్యకర్తలను మోహన్ భగవత్ కోరారు. వాటిని అరికట్టేలా చూడాలని సూచించారు. దేశ వ్యతిరేక, సంఘ విద్రోహ శక్తులు క్రియాశీలకంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. యువతరానికి సంఘ్ ఆలోచనలు, విలువలను వ్యాప్తి చేయడంలో ఆరెస్సెస్ కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేయాలని ఆయన కోరారు.  ఆరెస్సెస్ కు 100 ఏళ్లు నిండే నాటికి సంస్థ సందేశం భారతదేశంలోని ప్రతి గ్రామానికి చేరేలా చూడాలని భగవంత్ ఆరెస్సెస్ కార్యకర్తలను కోరారు.

వయనాడ్ నుంచి కాదు.. హైదరాబాద్ నుంచి పోటీ చేసి గెలవాలి - రాహుల్ గాంధీకి ఒవైసీ సవాల్..

కాగా.. పెరుగుతున్న మత మార్పిడుల అంశం చాలా సంవత్సరాలుగా సంఘ్ ఎజెండాలో ఎక్కువగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో పదేపదే సంఘటనలు నమోదవుతున్న నేపథ్యంలో భగవత్ తాజాగా ఈ అంశంపై పునరుద్ఘాటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే అవధ్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో హిందూ సమాజ సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆర్ఎస్ఎస్ అధినేత చర్చించారు.

‘పుష్ఫ’ను మించి గంజాయి స్మగ్లింగ్.. ఇటుక ట్రాక్టర్ బోల్తా పడటంతో వెలుగులోకి..

అలాగే సంఘ్ కార్యకలాపాల విస్తరణ, బలోపేతం సహా వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. వివిధ సామాజిక, వృత్తిపరమైన గ్రూపులకు శాఖలు నిర్వహించాలని నిర్ణయించారు. దేశ నిర్మాణానికి కట్టుబడి ఉన్న వివిధ వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు భగవత్ ప్రాధాన్యమిచ్చారని ఆరెస్సెస్ అధికారి ఒకరు తెలిపారు. వివిధ సానుకూల కార్యకలాపాలకు ఊతమిచ్చేందుకు సంఘ్ అలాంటి వారిని చేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆరెస్సెస్ చీఫ్ చెప్పారని అన్నారు. ఈ సమావేశంలో 2025 నాటికి పూర్తిస్థాయి కార్యకర్తలపై ఎక్కువ దృష్టి పెట్టాలని ఆర్ఎస్ఎస్ నిర్ణయించింది.

click me!