యువకుడితో కోడలి అక్రమ సంబంధం: ఇద్దరి ముక్కులు కోసేసిన మావయ్య

Siva Kodati |  
Published : Jan 29, 2020, 05:47 PM IST
యువకుడితో కోడలి అక్రమ సంబంధం: ఇద్దరి ముక్కులు కోసేసిన మావయ్య

సారాంశం

వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంతో ఓ జంట ముక్కు చెవులు కోసేయడంతో ఓ గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి

వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంతో ఓ జంట ముక్కు చెవులు కోసేయడంతో ఓ గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్య జిల్లా కంద్ పిప్రా గ్రామంలో ఓ వివాహిత అత్తమామలతో కలిసి నివసిస్తోంది.

Also Read:అమ్మకి ఇద్దరితో అక్రమ సంబంధం.. ఇంట్లో బంధించి...

ఆమె భర్త ఉపాధి నిమిత్తం దుబాయ్‌కి వెళ్లాడు. ఈ క్రమంలో వివాహిత వద్దకు సోమవారం అర్థరాత్రి ఓ యువకుడు రావడాన్ని ఆమె మావయ్య గమనించాడు. వీరిద్దరికి మధ్య వివాహేతర సంబంధం ఉందని ఎప్పటి నుంచో అనుమానిస్తున్న ఆయన ఇతర కుటుంసభ్యులతో కలిసి కోడలిని, యువకుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని స్తంభానికి కట్టేసి అనంతరం ముక్కులు కోసేశారు.

బాధితులిద్దరూ వేరు వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్ధితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసులను మోహరించాల్సి వచ్చింది.

Also Read:ప్రియుడితో కలిసి భర్తకు స్కెచ్.. ఫోన్ కాల్ తో గుట్టురట్టు!

తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్ధితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులుగా బాధితురాలి మావయ్యను అతనికి సహకరించిన మో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Recharge Price Hike : న్యూఇయర్ లో మీ ఫోన్ మెయింటెనెన్స్ మరింత కాస్ట్లీ.. మొబైల్ రీచార్జ్ ధరలు పెంపు..?
Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు