జేడీయూలో సీఏఏ చిచ్చు: ప్రశాంత్ కిషోర్ బహిష్కరణ

By narsimha lodeFirst Published Jan 29, 2020, 5:42 PM IST
Highlights

జేడీ యూ నుండి  ప్రశాంత్ కిషోర్ ను బహిష్కరిస్తున్నట్టుగా ఆ పార్టీ ప్రకటించింది.ఈ మేరకు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ విషయాన్ని ప్రకటించారు. 

పాట్నా: జేడీయూ నుండి ప్రశాంత్ కిషోర్ తో పాటు పవన్ వర్మలను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టుగా ఆ పార్టీ ప్రకటించింది.  బీహార్ ముఖ్యమంత్రి  నితీష్ కుమార్‌కు అత్యంత సన్నిహితులుగా ఉన్న ప్రశాంత్‌ కుమార్, పవన్ వర్మలను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టుగా ఆ పార్టీ ప్రకటించింది.

పౌరసత్వ చట్టంపై బహిరంగంగానే నితీష్ కుమార్ తీరుపై ప్రశాంత్ కిషోర్‌ , పవన్ వర్మలు విమర్శలు గుప్పించారు.దీనిపై నితీష్ కుమార్ ఇవాళ వారిద్దరిని పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించారు.

2015 లో బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్  విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన  ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ నుండి బహిష్కరణకు గురయ్యారు.  త్వరలోనే  బీహార్ రాష్ట్రంలో  ఎన్నికలు జరగనున్నాయి.  ఈ ఎన్నికలు జరగడానికి ముందే  ప్రశాంత్ కిషోర్ పార్టీ నుండి బహిష్కరణకు గురయ్యారు.

పార్టీ నుండి ప్రశాంత్ కిషోర్ ను బహిష్కరిస్తున్నట్టుగా  నితీష్ కుమార్ చేసిన ట్వీట్ కు ప్రశాంత్ కిషోర్ కూడ ట్వీట్ చేశారు. బీహార్ రాష్ట్ర సీఎం పదవిని నిలుపుకోవాలని ప్రశాంత్ కిషోర్ కోరారు. 

బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు సీఏఏ విషయంలో రాసిన లేఖలో పనవ్ వర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు.  2018 నుండి జేడీయూ ఉపాధ్యక్షుడిగా ప్రశాంత్ కిషోర్ కొనసాగుతున్నాడు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ విషయంలో వీరిద్దరి మధ్య అభిప్రాయబేధాలు నెలకొన్నాయి.

సీఏఏ విషయంలో పార్లమెంట్ లో పార్టీ మద్దతు ప్రకటించిన విషయాన్ని ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించారు. పార్టీ సమావేశంలో మాత్రం నితీష్ కుమార్ తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన తర్వాత కూడ పార్లమెంట్‌లో సీఏఏకు అనకూలంగా ఓటు వేసిన విషయాన్ని ప్రశాంత్ కిషోర్ తప్పుబట్టారు.అమిత్ షా సూచన మేరకే ప్రశాంత్ కిషోర్ ను పార్టీ వ్యూహాకర్తగా నియమించుకొన్నట్టుగా  బీహార్ సీఎం నితీష్ కుమార్ నిన్ననే ప్రకటించారు. 

click me!