
ఎల్పీజీ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది నేటి నుంచి అమల్లోకి రానుంది. ఒక్కో సిలిండర్ పై రూ.36 ను తగ్గించి అందించనుంది. అయితే ఇది కొంత మందికి మాత్రమే వర్తించనుంది. కేవలం వాణిజ్య సిలిండర్లను ఉపయోగించే వారికే ఈ తగ్గింపు ఉపయోగపడనుంది.
అనుమానంతో కొండపైకి తీసుకువెళ్లి భార్య హత్య.. నెల తరువాత లభించిన ఆనవాళ్లు..
ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఎల్పీజీ వినియోగదారులకు భారీ ఉపశమనం కలిగిస్తూ 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. నేటి నుంచి 19 కిలోల కమర్షియల్ సిలిండర్ బాటిల్‌పై రూ.36 తగ్గనుంది. దీంతో ఒక్కో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1976.50గా మారనుంది. గృహ అవసరాల కోసం ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధరలు అలాగే ఉండనున్నాయి. అయితే తగ్గింపు వల్ల కొంత మందికి ఉపశమనం లభించనుంది.
Unemployment: ఉద్యోగం లేదని.. నాగ్‌పూర్ వాసి ఆత్మహత్య
19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ఈ తగ్గింపునకు ముందు ఢిల్లీలో రూ. 2012.50 గా ఉంది. తాజా తగ్గింపుతో రూ.1976.50 గా మారింది. గతంలో కోల్‌కతాలో సిలిండర్‌కు రూ.2095.50గా మారింది. తాజాగా రూ.2132 గా మారింది. ముంబైలో సిలిండర్‌కు గతంలో రూ.1972.50గా ఉండగా.. ఇప్పుడు రూ.1936.50కి తగ్గింది. ఇక చెన్నైలో ఒక్కో సిలిండర్ రూ.2141గా మారింది. గతంలో ఇక్కడ ఒక్కో సిలిండర్ ధర రూ.2177.50 గా ఉంది. కాగా ఎక్కడా కూడా డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
ఆప్ దూకుడు.. గుజరాత్ పర్యటనకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. !
కాగా OMC (ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు)లు నెలకు రెండుసార్లు LPG ధర మార్పును ప్రకటిస్తాయి, నెల ప్రారంభంలో ఒకసారి, నెల మధ్యలో ఒకసారి ఈ ప్రకటన ఉంటుంది. కాగా ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ల ధరల్లో మాత్రమే తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. హోటల్, రెస్టారెంట్, బేకరీ వంటి వాటికి, ఇంటి అవసరాలకు కాకుండా ఇతర వ్యాపారాల వినియోగానికి వాడే గ్యాస్ సిలిండర్లన్నీ కమర్షియల్ జాబితా కిందకే వస్తాయి. వీటికి సబ్సిడీ వర్తించదు.