అనుమానంతో కొండపైకి తీసుకువెళ్లి భార్య హత్య.. నెల తరువాత లభించిన ఆనవాళ్లు..

Published : Aug 01, 2022, 06:42 AM IST
అనుమానంతో కొండపైకి తీసుకువెళ్లి భార్య హత్య.. నెల తరువాత లభించిన ఆనవాళ్లు..

సారాంశం

భార్య మీద అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి.. గంజాయి మత్తులో ఆమెను దారుణంగా హత్య చేశాడు. కాగా నెలరోజుల తరువాత ఆమె ఆనవాళ్లు దొరికాయి.   

తమిళనాడు : తమిళనాడు నారాయణవనం మండలంలోని కైలాసకోన కొండపై గతనెల భర్త చేతిలో హత్యకు గురైన వివాహిత మృతదేహం ఆనవాళ్లను పోలీసులు ఆదివారం కనుగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా సింగూర్ ప్రాంతానికి చెందిన మదన్, తమిళ సెల్వి మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మదన్ చెడు వ్యసనాలకు బానిస కావడంతో పాటు.. భార్యపై అనుమానం వ్యక్తం చేసేవాడు.దీంతో వరకట్నం పేరుతో తరచు వేధిస్తుండేవాడు.  జూన్ 25న తమిళ సెల్వితో కలిసి కైలాసకోనకు వచ్చాడు. ఆమెను కొండమీద ఉన్న బావుల సమీపంలోని అటవీ ప్రాంతం వద్దకు తీసుకువెళ్లి కత్తితో పొడిచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.

Unemployment: ఉద్యోగం లేదని.. నాగ్‌పూర్ వాసి ఆత్మ‌హ‌త్య

కూతురు కనిపించకపోవడం.. ఆమె తల్లిదండ్రులు మణ్ గండన్, పల్గీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిమదన్ నుఅదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. వారి విచారణలో షాకింగ్ విషయాలు మదన్ చెప్పుకొచ్చాడు. ఆమెను కైలాసకోన కొండపైకి తీసుకు వెళ్లానని, తమ మధ్య గొడవ జరిగిందని, కత్తితో పొడిచానని చెప్పాడు. ఆ తరువాత ఆమె తీవ్రంగా గాయపడటంతో.. అక్కడే వదిలేసి ఇంటికి వచ్చేసానని చెప్పాడు. గంజాయి మత్తులో ఉండడంతో ఆ ప్రాంతం సరిగా గుర్తు లేదు అని కూడా చెప్పాడు. నిందితుడు చెప్పిన సమాచారం ప్రకారం తమిళనాడు ఎస్సై రమేష్ కైలాసపురంలో ప్రత్యేక బృందంతో తమిళసెల్వి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. నెలరోజుల తర్వాత ఆదివారం ఉదయం కొండపై తమిళసెల్వి దుస్తులు, మెట్టెలు, పాదరక్షలు ఆధారంగా మృతదేహాన్ని గుర్తించి పంచనామా చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం