ప్రధాని మోడీకి లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం.. ఏమిటీ అవార్డు ? దాని ప్రత్యేకతలేంటంటే ?

Published : Jul 11, 2023, 03:46 PM IST
ప్రధాని మోడీకి లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం.. ఏమిటీ అవార్డు ? దాని ప్రత్యేకతలేంటంటే ?

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీకి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు లభించనుంది. ఆగస్టు 1వ తేదీన మహారాష్ట్రలో జరిగే కార్యక్రమంలో ఆయన అవార్డు అందుకోనున్నారు. గతంలో ఈ అవార్డు ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్ పేయి, శరద్ పవార్ వంటి నాయకులు అందుకున్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం లభించింది. ఆయన ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును ఆగస్టు 1న పుణెలో జరిగే కార్యక్రమంలో ప్రధాని అందుకోనున్నారు. అత్యున్నత నాయకత్వానికి గుర్తింపుగా, పౌరుల్లో దేశభక్తి భావనను మేల్కొలిపినందుకు గాను ఆయన అవార్డుకు ఎంపికయ్యారు. 

రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులు.. కేసును విచారించి అతడిని శిక్షించాలి : ఢిల్లీ పోలీస్ ఛార్జిషీట్

లోకమాన్య తిలక్ 103వ వర్ధంతి సందర్భంగా ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోడీకి ఈ అవార్డు అందజేయనున్నట్టు తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ (హింద్ స్వరాజ్ సంఘ్) అధ్యక్షుడు దీపక్ తిలక్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘ ఆత్మనిర్భర్ భారత్ కాన్సెప్ట్ తో ప్రధాని నాయకత్వంలో భారతదేశ ప్రగతి నిచ్చెన ఎక్కింది. ప్రధాని మోడీ పౌరుల్లో దేశభక్తిని మేల్కొలిపి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టారు. ఆయన పట్టుదల, కృషిని పరిగణనలోకి తీసుకుని, ట్రస్టీలు ఆయనను ఈ అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపిక చేశాయి’’ అని తెలిపారు. కాగా.. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ముఖ్య అతిథిగా హాజరుకానుండగా.. ఆయన సోదరుడి కుమారుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా ఆహ్వానితులలో ఉన్నారు.

గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కు అస్వస్థత.. హాస్పిటల్ కు తరలించిన జైలు అధికారులు

ఏమిటీ ఈ అవార్డు ప్రత్యేకతలు.. 
విప్లవకారుడు, జాతీయ స్వాతంత్ర్య సమరయోధుడు లోకమాన్య బాలగంగాధర తిలక్ (1856-1920) జ్ఞాపకార్థం గౌరవనీయ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును ప్రతి సంవత్సరం ఇస్తారు. లోకమాన్య తిలక్ వర్ధంతి సందర్భంగా తిలక్ స్మారక మందిర్ ట్రస్ట్ (హింద్ స్వరాజ్ సంఘ్) ఈ అవార్డును ప్రదానం చేస్తుంది.

దేశ ప్రజాస్వామ్య సూత్రాల బలోపేతానికి తన జీవితాన్ని అంకితం చేసి, తిలక్ కలలుగన్న బలమైన, ఆధునిక భారతావనికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందిస్తారు. ఈ అవార్డులో జ్ఞాపిక, ప్రశంసాపత్రం ఉంటాయి. ఈ అవార్డును అందుకోనున్న 41వ వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ. 

పరీక్ష రాసేందుకు వెళ్లిన తల్లి.. పసికందును ఆడిస్తూ, విధులు నిర్వర్తించిన మహిళా కానిస్టేబుల్.. ఫొటోలు వైరల్

భారత క్షిపణి మహిళగా పేరొందిన సీనియర్ శాస్త్రవేత్త టెస్సీ థామస్ కు గత ఏడాది లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు లభించింది.
అంతకుముందు ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్ పేయి, శరద్ పవార్, రాహుల్ బజాజ్, సైరస్ పూనావాలా, మన్మోహన్ సింగ్ లకు ఈ అవార్డును ప్రదానం చేశారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం